Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: ప్ర‌పంచ రికార్డు సృష్టించిన రోహిత్ శ‌ర్మ.. అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డిగా..

India vs Sri Lanka: Rohit Sharma holds the record for most matches played in international T20 cricket at 125

ధ‌ర్మ‌శాల‌: ఇండియా, శ్రీ‌లంక మూడో టీ20 మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌తో అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 125 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అంత‌ర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా రోహిత్ శ‌ర్మ రికార్డు సృష్టించాడు.

షోయ‌బ్ మాలిక్ రికార్డు బ్రేక్

షోయ‌బ్ మాలిక్ రికార్డు బ్రేక్

అలాగే అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 125 మ్యాచ్‌లు ఆడిన ఒకే ఒక్క‌డిగా రోహిత్ శ‌ర్మ నిలిచాడు. ఈ క్ర‌మంలో పాకిస్థాన్ ఆట‌గాడు షోయ‌బ్ మాలిక్ రికార్డును రోహిత్ శ‌ర్మ బ్రేక్ చేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు 124 మ్యాచ్‌ల‌తో అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా ఉన్న షోయ‌బ్ మాలిక్‌ను రోహిత్ శ‌ర్మ అధిగ‌మించాడు. కాగా ప్ర‌స్తుతం అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రికార్డు కూడా రోహిత్ శ‌ర్మ పేరు మీద‌నే ఉంది.

రోహిత్ రికార్డులు

రోహిత్ రికార్డులు

టీ20 కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు రోహిత్ శ‌ర్మ 32 స‌గ‌టుతో 3308 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అత్య‌ధిక స్కోర్ 118 ప‌రుగులు. ఈ క్ర‌మంలో 292 ఫోర్లు, 155 సిక్సులు బాదాడు. కెరీరలో రోహిత్ శ‌ర్మ అంత‌ర్జాతీయ స్థాయిలో ఇప్ప‌టివ‌ర‌కు 230 వ‌న్డే మ్యాచ్‌లు, 43 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 213 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 46 స‌గ‌టుతో 3047 ప‌రుగులు, వ‌న్డేల్లో 48 స‌గ‌టుతో 9283 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో 31 స‌గ‌టుతో 5611 ప‌రుగులు చేశాడు. మొత్తంగా అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 41 సెంచ‌రీలు బాదాడు. ఇందులో వ‌న్డేల్లో 29, టెస్టుల్లో 8, టీ20ల్లో 4 సెంచ‌రీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ హిట్‌మ్యాన్ ఓ సెంచ‌రీ బాదాడు.

 టాస్ గెలిచిన శ్రీ‌లంక‌

టాస్ గెలిచిన శ్రీ‌లంక‌

భార‌త్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో శ్రీ‌లంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొద‌ట బౌలింగ్ చేయ‌నుంది. ఇప్ప‌టికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవ‌సం చేసుకున్న టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాల‌ని భావిస్తుండ‌గా.. చివ‌రి మ్యాచ్‌లోనైనా గెలిచి ప‌రువు కాపాడుకోవాల‌ని శ్రీ‌లంక భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 4 మార్పుల‌తో బ‌రిలోకి దిగుతుండ‌గా.. శ్రీ‌లంక రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శ‌ర్మ‌కు జ‌త‌గా వికెట్ కీప‌ర్ సంజూ శాంస‌న్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నాడు.

తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్(వికెట్ కీప‌ర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్‌), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

Story first published: Sunday, February 27, 2022, 19:27 [IST]
Other articles published on Feb 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+