For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: ఒరెయ్ సుందరం.. నావైపు చూస్తావేంట్రా?- రోహిత్ సీరియస్ (Video)

సహచర ఆటగాళ్లను టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిట్టడం ఓ ఎమోషన్. ప్లేయర్లు తప్పుచేస్తే హిట్‌మ్యాన్ తనదైశ శైలిలో ప్లేయర్లకు స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. ఇలా రోహిత్ చేసిన వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యి వైరల్‌గా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆ జాబితాలో మరో వీడియో చేరింది. రివ్యూ విషయంలో వాషింగ్టన్ సుందర్‌‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు.

అసలేం జరిగిందంటే.. 29వ ఓవర్‌లో సుందర్ వేసిన అయిదో బంతి వెల్లలాగే ప్యాడ్లకు తాకింది. దీంతో సుందర్ ఔట్ అని అపీలు చేశాడు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వలేదు. దీంతో సుందర్ స్లిప్‌లో ఉన్న రోహిత్ వైపు చూశాడు. రివ్యూకి వెళ్లమంటావా అని సుందర్‌ను రోహిత్ అడిగాడు. దానికి సుందర్ కాన్ఫిడెంట్‌గా రిప్లై ఇవ్వలేదు. నీకేమనిపిస్తుందని అన్నట్లుగా సుందర్ బదులిచ్చాడు.

India vs Sri Lanka Rohit Sharma Calls Out Washington Sundar s Laziness as DRS Timer Runs Out

మరోవైపు రివ్యూ కోరే సమయం ముగిసిపోతుండటంతో సుందర్‌పై రోహిత్ సీరియస్ అయ్యాడు. స్లిప్‌లో ఉన్న తనకి ఎలా కనిపిస్తుందని అరిచాడు. ''ఏంటి? ఆ విషయాన్ని నువ్వే చెప్పాలి. నావైపు ఎందుకు చూస్తున్నావు? అన్ని విషయాలు నేను ఎలా చేయాలి?'' అని రోహిత్ అన్నాడు. అలా అరిచిన తర్వాత హిట్‌మ్యాన్ వెంటనే నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా, కొలంబో వేదికగా శుక్రవారం ఉత్కంఠ భరితంగా సాగిన భారత్- శ్రీలంక తొలి వన్డే టైగా మారింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఎనిమిది వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ధునిత్ వెల్లలాగే (66 నాటౌట్; 65 బంతుల్లో, 7 ఫోర్లు, 2 సిక్సర్లు), నిస్సాంక (56; 75 బంతుల్లో, 9 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ (2/33), అర్షదీప్ సింగ్ (2/47) తలో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన భారత్‌ 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ శర్మ (58; 47 బంతుల్లో, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. లంక బౌలర్లలో హసరంగ (3/58), అసలంక (3/30) చెరో మూడు, వెల్లలాగే రెండు వికెట్లతో సత్తాచాటారు.అయితే ఆఖర్లో దూబె (25; 24 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు) కీలక పరుగులతో విజయ సమీకరణం 15 బంతుల్లో ఒక్క పరుగుగా మారింది. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. కానీ అలసంక వరుసగా దూబె, అర్షదీప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో తొలి వన్డే టైగా మారింది.

Story first published: Saturday, August 3, 2024, 9:16 [IST]
Other articles published on Aug 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+