IND vs SL: ఐపీఎల్ ముందే వచ్చేసింది.. రిషబ్ పంత్ విధ్వంసం.. 40 ఏళ్ల కపిల్ దేవ్ రికార్డు బద్దలు

బెంగళూరు: ఐపీఎల్ 2022 ముందే వచ్చేసింది. శ్రీలంకతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ బ్యాటింగ్ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ అభిప్రాయం రాకమానదు. ఎందుకంటే ఈ టెస్టు మ్యాచ్‌లో రిషబ్ పంత్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల నాటి కపిల్ దేవ్ రికార్డును సైతం పంత్ బద్దలు కొట్టాడు. పంత్ విధ్వంసంతో టీమిండియా కూడా ఈ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌పై పట్టు బిగిచింది.

పంత్ విధ్వంసం
సెకండ్ ఇన్నింగ్స్‌లో హనుమ విహారీ ఔటైయ్యాక క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ మొదటి బంతి నుంచే శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడి మొదలుపెట్టాడు. ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సు బాదేశాడు. ఆరంభం నుంచే వరుసగా బౌండరీలు బాదుతూ, టీ20 తరహాలో బ్యాటింగ్ చేస్తూ శ్రీలంక బౌలర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 7 బంతుల్లో 20, 8 బంతుల్లో 24, 15 బంతుల్లో 31 పరుగులతో బ్యాటింగ్ చేశాడంటేనే పంత్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. పంత్ బ్యాటింగ్ చూసిన వారికి ఐపీఎల్ 2022 ముందే వచ్చేసిందా అనే అభిప్రాయం రాక మానదు. ఈ క్రమంలోనే రికార్డు స్థాయిలో 7 ఫోర్లు, 2 సిక్సులతో పంత్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 31 బంతులు ఎదుర్కొన్న పంత్ 50 పరుగులు చేసి జయవిక్రమ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ఇన్నింగ్స్‌లో పంత్ ఏకంగా 161 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేయడం గమనార్హం.

కపిల్ దేవ్ రికార్డు బద్దలు
రిషబ్ పంత్ ఈ విధ్వంసకర ఆట తీరుతో 40 ఏళ్ల నాటి కపిల్ దేవ్ రికార్డును బద్దలు కొట్టాడు. 1982లో కరాచీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కపిల్ దేవ్ 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. తాజాగా రిషబ్ పంత్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో వేగంగా హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా ఆటగాడిగా నిలిచాడు. పంత్, కపిల్ తర్వాత ఈ జాబితాలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శార్దూల్ ఠాకూర్ మూడో స్థానంలో, 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరేంద్ర సెహ్వాగ్ నాల్గో స్థానంలో ఉన్నారు.

మొదటి ఇన్నింగ్స్‌లోనూ ఇదే విధ్వంసం
ఇదే టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ రిషబ్ పంత్ ఇదే తరహా బ్యాటింగ్‌తో దుమ్ములేపాడు. 26 బంతుల్లోనే 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. అంతకుముందు మొదటి టెస్ట్ మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడాడు. మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 97 బంతుల్లోనే 96 పరుగులు బాదేశాడు. అయితే టెస్టుల్లో రిషబ్ పంత్ ఇలా ధాటిగా ఆడడం ఇది కొత్తేం కాదు. గతంలోనే అనేక సార్లు ఇలాగే ఆడాడు.

టీమిండియాకు భారీ అధిక్యం
రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి శ్రీలంకపై టీమిండియా 342 పరుగుల భారీ అధిక్యంలో ఉంది. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 199-5గా ఉంది. క్రీజులో శ్రేయస్ అయ్యర్ (18), రవీంద్ర జడేజా (10) ఉన్నారు. అంతకుముందు పంత్ 50, రోహిత్ శర్మ 46, హనుమ విహారీ 35, మయాంక్ అగర్వాల్ 22, విరాట్ కోహ్లీ 13 పరుగులు చేసి ఔటయ్యారు. 29 ఓవర్లపాటు సాగిన సెకండ్ సెషన్‌లో పంత్ దూకుడుతో 138 పరుగులు రావడంతోపాటు 4 వికెట్లు నెలకూలాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications