For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs SL: గురువును మించిన శిష్యుడు.. ధోని వ‌ల్ల కానిది పంత్ సొంతం.. తొలి వికెట్ కీప‌ర్‌గా రికార్డు

India vs Sri Lanka: Rishabh Pant becomes first Indian wicketkeeper to won Man of the Series award in Test format
Rishabh Pant First Indian Wicketkeeper To Win “Man Of The Series” In Test | Oneindia Telugu

బెంగ‌ళూరు: టీమిండియా వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం బ్యాట‌ర్‌గా, వికెట్ కీప‌ర్‌గా సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే టీమిండియాకు అన్ని ఫార్మాట్ల‌లో కీల‌క ఆట‌గాడిగా మారాడు. ఈ క్ర‌మంలో మ‌హేంద్ర‌సింగ్ ధోని వ‌ల్ల కూడా కాని ఓ అవార్డును తాజాగా రిషబ్ పంత్ అందుకోవ‌డం విశేషం. దీంతో ప్ర‌స్తుతం దీని గురించిన చ‌ర్చ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

తొలి వికెట్ కీప‌ర్‌గా

తొలి వికెట్ కీప‌ర్‌గా

శ్రీ‌లంక‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-0 తో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో ధ‌నాధ‌న్ బ్యాటింగ్‌తో అద‌ర‌గొట్టిన టీమిండియా వికెట్ కీప‌ర్ రిషబ్ పంత్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్ర‌మంలో టెస్టుల్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న తొలి భార‌త వికెట్ కీప‌ర్‌గా రిషబ్ పంత్ రికార్డు సృష్టించాడు. కాగా టీమిండియా దిగ్గ‌జ వికెట్ కీప‌ర్ మ‌హేంద్ర‌సింగ్ ధోని 90 టెస్టు మ్యాచ్‌లు ఆడిన‌ప్ప‌టికీ ఒక్క సారి కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోలేక‌పోయాడు.

గురువును మించిన శిష్యుడు

గురువును మించిన శిష్యుడు

మ‌హేంద్ర‌సింగ్ ధోని వ‌ల్ల కూడా కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌ను రిష‌బ్ పంత్ గెలుచుకోవ‌డంతో ప్ర‌స్తుతం అత‌నిపై అంతట ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప‌లువురు గురువును మించిన శిష్యుడు అంటూ రిషబ్ పంత్‌ను తెగ పొగిడేస్తున్నారు.

అయితే ఒక్క ధోని మాత్ర‌మే కాదు టీమిండియా వికెట్ కీప‌ర్లుగా చాలా మందే ప‌ని చేసిన‌ప్పటికీ ఎవ‌రూ క‌నీసం ఒక్క‌సారి కూడా మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకోలేక‌పోయారు. గ‌తంలో టీమిండియా వికెట్ కీప‌ర్లుగా వృద్ధిమాన్ సాహా, కిరణ్ మోరే, సయ్యద్ కిర్మాణి సైతం విశేష సేవ‌లు అందించారు. కానీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అనేది వారంద‌రికీ క‌ల‌గానే మిగిలిపోయింది.

చెల‌రేగిన పంత్‌

చెల‌రేగిన పంత్‌

ఇక శ్రీ‌లంక‌తో టెస్టు సిరీస్‌లో బ్యాట‌ర్‌గా రిషబ్ పంత్ దుమ్ములేపాడు. సిరీస్ అసాంతం టీ20 త‌ర‌హాలో బ్యాటింగ్ చేశాడు. ఈ సిరీస్‌లో 3 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసిన పంత్.. 61 స‌గ‌టుతో 185 ప‌రుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్ 120గా న‌మోదైంది. ఈ క్ర‌మంలో 23 ఫోర్లు, 6 సిక్సులు బాదాడు. మొహాలీ టెస్టులో 97 బంతుల్లో 96 ప‌రుగులు చేసిన పంత్‌.. బెంగ‌ళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 26 బంతుల్లో 39 ప‌రుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 30 బంతుల్లోనే 50 ప‌రుగులు చేశాడు.

టీమిండియా ఘ‌న విజ‌యం

టీమిండియా ఘ‌న విజ‌యం

ఇక బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘ‌న‌విజ‌యం సాధించింది. 3 రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన 238 ప‌రుగుల తేడాతో జ‌య‌భేరి మోగించింది. 447 ప‌రుగులు భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన శ్రీ‌లంక 208 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

స్కోర్లు:

భార‌త్: 252, 303-8 డిక్లేర్‌

శ్రీలంక‌: 109, 208.

Story first published: Tuesday, March 15, 2022, 11:30 [IST]
Other articles published on Mar 15, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+