
బెంగళూరు: టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆట తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫార్మాట్ ఏదైనా సరే దూకుడుతో పరుగులు చేస్తుంటాడు. ప్రతి బంతిని బాదుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తుంటాడు. శ్రీలంకతో సిరీస్‌లోనూ రిషబ్ పంత్ ఇదే దూకుడును కనబరుస్తున్నాడు. నేటి నుంచి ప్రారంభమైన పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లోనైతే ఆడింది కాసేపే అయినప్పటికీ టీ20 తరహాలో బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు.లంచ్ బ్రేక్‌కు మందు క్రీజులోకి వచ్చిన పంత్ ఎదుర్కొన్న రెండు, మూడో బంతులనే బౌండరీలు బాదాడు.
లంచ్ సెషన్ తర్వాత కూడా ఏ మాత్రం తగ్గలేదు. వరుసగా బౌండరీలు బాదుతూ టెస్ట్ మ్యాచ్‌ను కాస్త టీ20 మ్యాచ్‌గా మార్చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో ఎదుర్కొన్నది 26 బంతులే అయినప్పటికీ 39 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. పంత్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు ఉన్నాయి.
శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌లోనూ రిషబ్ పంత్ ఇలాగే చెలరేగాడు. వన్డే తరహా బ్యాటింగ్‌తో 97 బంతుల్లోనే 96 పరుగులు బాదేశాడు. ఇందులో 9 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. సెంచరీ ఖాయమనుకున్న దశలో లక్మల్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. సౌతాఫ్రికాతో మూడో టెస్ట్ మ్యాచ్‌లోనూ రిషబ్ పంత్ ఇలాగే బ్యాటింగ్ చేశాడు. 6 ఫోర్లు, 4 సిక్సులతో 139 బంతుల్లోనే సెంచరీతో అజేయంగా నిలిచాడు. రిషబ్ పంత్ ఈ తరహా విధ్వంసంపై నెటిజన్లు స్పందిస్తున్నారు.
ఇది టీ20 మ్యాచ్ కాదని, టెస్టు మ్యాచ్‌ను రిషబ్ పంత్‌కు గుర్తు చేస్తున్నారు. అలాగే ఫార్మాట్ ఏదైనా పంత్‌కు తెలిసింది బాదడమే అంటూ మరికొందరు రాసుకొస్తున్నారు. పంత్ తన బ్యాటింగ్‌తో టెస్టు క్రికెట్‌ను కూడా చూడాలనే ఆసక్తి కల్గేలా చేశాడని మరికొందరు అంటున్నారు. ఇలా పంత్ బ్యాటింగ్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.