
ఓపెనర్లుగా రోహిత్, రుతురాజ్
తొలి టీ20 మ్యాచ్‌లో ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రోహిత్‌కు తోడుగు గైక్వాడ్‌ను ఓపెనర్‌గా పంపి వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఓపెనర్‌గా వచ్చిన ఇషాన్ కిషన్‌ను మిడిలార్డర్‌లో ఆడించాలని టీం మెనేజ్‌మెంట్ భావిస్తోంది. లేదంటే గతంలో మాదిరిగానే రోహిత్, ఇషాన్ కిషన్‌ను ఓపెనర్లుగా ఆడించి, రుతురాజ్ గైక్వాడ్‌ను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు పంపాలని మెనేజ్‌మెంట్ భావిస్తుందని సమాచారం.

మిడిలార్డర్‌లో ఎవరెవరు?
శ్రేయస్ అయ్యర్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపి, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు పంపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఈ సిరీస్ మొత్తానికి ఇషాన్ కిషనే వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. ఇక చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు.

ఆల్‌రౌండర్లుగా..
అలాగే మంచి ఫాంలో ఉన్న యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఆరో స్థానంలో, సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఏడో స్థానంలో బ్యాటింగ్ రానున్నారు. వీరిద్దరు జట్టులో ఆల్‌రౌండర్ పాత్ర పోషించనున్నారు. కాగా గాయంతో జట్టుకు దూరమైన సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చాలా కాలం తర్వాత జట్టులోకి రానున్నాడు.

బౌలర్లు
ఈ మ్యాచ్‌లో పేస్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ బరిలోకి దిగడం ఖాయంగా చెప్పుకోవాలి. మూడో పేసర్ కూడా కావాలనుకుంటే యువ పేసర్ హర్షల్ పటేల్‌కు కూడా తుది జట్టులో చోటు దక్కుతుంది. ఇక స్పిన్ కోటాలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖాయం కాగా.. మరొక స్పిన్నర్ మాత్రమే తుది జట్టులోకి తీసుకుంటే రవి బిష్ణోయ్, యజుర్వేంద్ర చాహల్‌లో ఒక్కరికే చోటు దక్కుతుంది. ముగ్గురు స్పిన్నర్లను తీసుకుంటే ఇద్దరు జట్టులో ఉంటారు. అయితే తుది జట్టులోకి ముగ్గురు స్పిన్నర్లను తీసుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో జడేజా, చాహల్, రవి బిష్ణోయ్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని చెప్పుకోవాలి.

టీమిండియా తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్, వెంకటేశ్ అయ్యర్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యజుర్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్.


Click it and Unblock the Notifications
