
జడేజా విశ్వరూపం
శ్రీలంకతో తొలి టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విశ్వరూపం చూపించాడు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత గేర్ మార్చాడు. 10 ఫోర్లతో 160 బంతుల్లో సెంచరీ చేసిన జడేజా ఆ తర్వాత దూకుడుగా ఆడాడు. సెంచరీ తర్వాత ఎదుర్కొన్న మరో 68 బంతుల్లోనే 75 పరుగులు బాదేశాడు. ఈ మ్యాచ్‌ల్లో మొత్తంగా 228 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర జడేజా 17 ఫోర్లు, 3 సిక్సులతో 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని స్ట్రైక్‌రేట్ 76గా ఉంది.

టీమిండియా భారీ స్కోర్
రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారీ రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది. 574-8 వద్ద టీమిండియా స్కోర్‌ను డిక్లేర్ చేశారు. జడేజా 175, షమీ 20 పరుగులతో అజేయంగా నిలిచారు. మిగతా బ్యాటర్లలో పంత్ 96, అశ్విన్ 61, హనమ విహారీ 58, కోహ్లీ 45, మయాంక్ అగర్వాల్ 33, రోహిత్ శర్మ 29, శ్రేయస్ అయ్యర్ 27, జయంత్ యాదవ్ 2 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, ఫెర్నాండో, ఎంబుల్దేనియా రెండేసి వికెట్లు తీశారు. డి శిల్వ, లహిరు కుమార తలో వికెట్ తీశారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో టీమిండియా 129.2 ఓవర్లు బ్యాటింగ్ చేసింది. చివరి వికెట్‌కు జడేజా 92 బంతుల్లోనే 103 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

వార్న్‌కు సంతాపం
ఇండియా, శ్రీలంక తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట ప్రారంభమైంది. ఆట ప్రారంభానికి ముందు శుక్రవారం మృతి చెందిన దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ మృతి పట్ల ఇరు జట్ల ఆటగాళ్లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్ సంతాపం పాటించారు. షేన్‌వార్న్‌కు మృతికి సంతాపంగా ఒక నిముషం పాటు మౌనం పాటించారు. అనంతరం మ్యాచ్ ప్రారంభించారు. అలాగే ఆటగాళ్లంతా చేతులకు నల్ల బ్యాడ్జ్‌లను ధరించి మ్యాచ్ ఆడుతున్నారు.


Click it and Unblock the Notifications












