
స్టెయిన్ రికార్డు బ్రేక్
శ్రీలంకతో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఇప్పటివరకు రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా టెస్టు ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో 439 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్‌ను అశ్విన్ అధిగమించాడు. కెరీర్లో 93 టెస్టు మ్యాచ్‌లు ఆడిన డేల్ స్టెయిన్ 439 వికెట్లు తీశాడు. కాగా అశ్విన్ 86 టెస్టు మ్యాచ్‌ల్లోనే ఈ రికార్డును అధిగమించడం గమనార్హం.

మురళీధరన్‌కు ఫస్ట్ ప్లేసు
అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ రికార్డు శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరు మీద ఉంది. 133 టెస్టుల్లో మురళీధరన్ 800 వికెట్లు తీశాడు. ఇక 708 వికెట్లతో ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ రెండో స్థానంలో ఉన్నాడు. 640 వికెట్లతో ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మూడో స్థానంలో ఉండగా.. 619 వికెట్లతో టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే నాల్గో స్థానంలో ఉన్నాడు. 563 వికెట్లతో ఆస్ట్రేలియా మాజీ పేసర్ ఐదో స్థానంలో, 537 వికెట్లతో ఇంగ్లండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఇక ఏడో స్థానంలో ఉన్న వెస్టిండీస్ బౌలర్ వాల్ష్ ఖాతాలో 519 వికెట్లు ఉన్నాయి. 440 వికెట్లతో అశ్విన్ ఎనిమిది, 439 వికెట్లతో డేల్ స్టెయిన్ తొమ్మిదో స్థానంలో ఉన్నారు.

రెండో భారత బౌలర్‌గా
టెస్టు ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతని ఖాతాలో 440 వికెట్లు ఉన్నాయి. ఇక 619 వికెట్లతో అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉన్నాడు. కాగా ఇదే శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో అశ్విన్.. కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే.

విజయం దిశగా భారత్
పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 447 పరుగుల భారీ లక్ష్య చేధనలో లంక బ్యాటర్లు తలపడుతున్నారు. ప్రస్తుతం ఆ జట్టు స్కోర్ 150 పరుగులు దాటింది. కానీ 4 వికెట్లు కోల్పోయింది. శ్రీలంక గెలవాలంటే మరో 297 పరుగులు చేయాలి. చేతిలో 6 వికెట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో టీమిండియా విజయం ఖాయమనే చెప్పుకోవాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేస్తుంది.


Click it and Unblock the Notifications












