For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

భారత్ Vs శ్రీలంక: కోల్‌కతా టెస్టుకు పొంచి ఉన్న వర్షం ముప్పు?

By Nageshwara Rao
India vs Sri Lanka: Rain threat looms large over 1st Test in Kolkata

హైదరాబాద్: మూడు టెస్టుల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం ప్రారంభం కానుంది. ప్రస్తుతం కోల్‌కతాలో వర్షాలు పడుతుండటంతో తొలి టెస్టుపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ మ్యాచ్‌కు వరణుడి రూపంలో ముప్పు పొంచి ఉంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో శనివారం వరకూ కొనసాగుతుండటంతో కోల్‌కతాలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో గురువారం కోల్‌కతాలోని పలు చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. దీంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది.

అయితే, చిరుజల్లులు మ్యాచ్‌కు ఏ మాత్రం ఆటంకం కలిగించవని కోల్‌కతా క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) గ్రౌండ్ కమిటీ హెడ్ దేబబ్రతా దాస్ తెలిపారు. నాలుగు గంటలపాటు వర్షం కురిసినా కూడా 20 నిమిషాల్లోనే నీటిని బయటకు తోడేస్తామని ఆయన ధీమాగా చెప్పారు. పిచ్ కవర్లపై నిలిచిన నీటిని పీల్చే యంత్రాలను తెప్పించామని ఆయన తెలిపారు.

వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోకుండా ఉండేందుకు అత్యాధునిక యంత్రాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ఇంగ్లాండ్ నుంచి తెప్పించిన హోవర్ కవర్‌గా పిలిచే పిచ్ కవర్‌ను మైదానం మొత్తం కప్పి ఉంచారు. వర్షం నీరు నిలవకుండా ఉండేందుకు తగిన మార్పులు చేపట్టారు.

నీటిని పీల్చే సూపర్ సోప్పర్లు సైతం కోల్‌కతా క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) వద్ద ఉన్నాయి. కాగా, ఇటీవలే శ్రీలంక సొంత గడ్డ మీద భారత్ చేతిలో వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. గత 35 ఏళ్లలో ఆ జట్టు భారత గడ్డ మీద 16 టెస్టులు ఆడినప్పటికీ.. ఒక్క టెస్టులో కూడా విజయం సాధించకపోవడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, November 15, 2017, 18:25 [IST]
Other articles published on Nov 15, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+