Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భార‌త్-శ్రీలంక వ‌న్డేకు కూడా అనుకూలించ‌ని వాతావ‌ర‌ణం..?

India vs Sri Lanka: Rain likely to affect outcome of 1st ODI in Dharamsala

హైద‌రాబాద్‌: భారత్‌-శ్రీలంకల మధ్య తొలి వన్డే హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని ధర్మశాలలో జరగనుంది. రేపటి నుంచి మూడు వన్డేల సిరీస్‌ ప్రారంభంకానున్న నేప‌థ్యంలో ఇది తొలి మ్య‌చ్‌. ఇరు జట్ల మధ్య జ‌ర‌గ‌నున్న మొద‌టి వన్డే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందని వాతావరణశాఖ అధికారులు శుక్రవారం వెల్లడించారు.

శుక్ర‌వారం సాయంత్రం స్థానిక వాతావ‌ర‌ణ శాఖ 10వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. డిసెంబ‌రు 10న ఆదివారం ఉదయం 11.30గంటలకు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. బీసీసీఐ సెలక్టర్లు విరాట్‌ కోహ్లీకి విశ్రాంతి కల్పించడంతో టీమిండియా సారథ్య బాధ్యతలను రోహిత్‌ శర్మ అందుకున్నాడు.

ప్ర‌క‌టించిన ప్రాంతాల్లో ధ‌ర్మ‌శాల కూడా ఉండ‌టంతో చిన్న ఆందోళ‌న మొద‌లైంది. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగ మంచు కూడా ఏర్పడవచ్చని అధికారులు తెలిపారు. దీనిపై హిమాచల్‌ప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌పీసీఏ) మీడియా ప్రతినిధి మోహిత్‌ సూద్‌ మాట్లాడుతూ.. 'వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేశాం. ప్ర‌తి క్ష‌ణం సిబ్బంది సిద్ధంగానే ఉంటారు. ఎలాంటి ఆందోళన అవరసం లేదు' అని వివ‌రించారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 9, 2017, 14:30 [IST]
Other articles published on Dec 9, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+