
బెంగళూరు: శ్రీలంక పేసర్ సురంగ లక్మల్ క్రికెట్ కెరీర్ ముగిసింది. పింక్ బాల్‌టెస్ట్ మ్యాచ్‌లో ఆదివారమే శ్రీలంక జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తమ బౌలింగ్ పూర్తి చేసింది. దీంతో సురంగ లక్మల్ క్రికెట్ కెరీర్ కూడా ఆదివారమే ముగిసింది. భారత్‌తో టెస్టు సిరీస్ తర్వాత తాను క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఈ 35 ఏళ్ల పేసర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
దీంతో ఆదివారం టీమిండియా 303 పరుగుల వద్ద తమ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో లక్మల్ కెరీర్ కూడా ముగిసింది. లక్మల్ తన కెరీర్లో చివరి బంతిని రవీంద్ర జడేజాకు వేశాడు. తన చివరి ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు బౌలింగ్ చేసిన లక్మల్ 34 పరుగులిచ్చాడు. కానీ దురదృష్టవశాత్తూ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
చివరి మ్యాచ్‌లో లక్మల్‌ను శ్రీలంక ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ అనర్‌తో గౌరవించారు. అనంతరం డ్రెస్సింగ్ రూంకు వస్తున్న లక్మల్‌ను టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా అభినందించారు. అతనితో కరచాలనం చేసి, అప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా లక్మల్ సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలని వారు ఆకాంక్షించారు.
దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. కాగా కెరీర్లో 70 టెస్ట్ మ్యాచ్‌లాడిన లక్మల్ 171 వికెట్లు తీశాడు. ఓ ఇన్నింగ్స్‌లో అత్యుత్తమ గణాంకాలు 5/47 కాగా, మ్యాచ్‌లో 7/80గా ఉన్నాయి. ఇక 86 వన్డేల్లో 109 వికెట్లు, 11 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు.
ఇక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన రోహిత్ సేన రెండో రోజు కూడా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక విజయానికి 419 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో కెప్టెన్ కరుణరత్నే (10), కుశాల్ మెండీస్ (16) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే తిరిమాణేను ఎల్బీగా డకౌట్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం ఖాయమైందనే చెప్పుకోవాలి.