
డీఆర్ఎస్‌ల్లో అట్టర్ ఫ్లాఫ్
రెండో రోజు ఆటలో డీఆర్ఎస్‌లను ఉపయోగించుకోవడంలో శ్రీలంక జట్టు అట్టర్ ఫ్లాఫ్ అయింది. రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇది స్పష్టంగా కనిపించింది. డీఆర్ఎస్‌ల విషయంలో లంక వైఫల్యానికి ఆటగాళ్ల అనుభవలేమి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. భారత బ్యాటర్లు ఔట్ అయినా సమయంలో డీఆర్ఎస్‌కు వెళ్లకుండా, ఔట్ కానీ సమయాల్లో డీఆర్ఎస్‌కు వెళ్లి శ్రీలంక చేతులు కాల్చుకుంది.
ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఐదు సార్లు శ్రీలంక భారత ఆటగాళ్లను ఔట్ చేసే అవకాశాన్ని కోల్పోయింది. అవసరమైనప్పుడు శ్రీలంక డీఆర్ఎస్‌కు వెళ్లకపోవడంతో మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ, హనుమ విహారి, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ఔటయ్యే ప్రమాదం నుంచి బయట పడ్డారు. తర్వాత టీవీ స్క్రీన్‌పై ఎల్బీడబ్ల్యూలో బంతి వికెట్లను తాకి, బ్యాటర్లు ఔటైనట్టు క్లియర్‌గా కనిపించింది.

అనవసర సమయాల్లో డీఆర్ఎస్
అవసరమైనప్పుడు డీఆర్ఎస్‌కు వెళ్లకుండా అనవసర సమయాల్లో డీఆర్ఎస్‌కు వెళ్లి శ్రీలంక చేతులు కాల్చుకుంది. శ్రీలంక డీఆర్ఎస్‌కు వెళ్లిన ప్రతిసారి బంతి వికెట్లను మిస్సవడం గమనార్హం. 40వ ఓవర్లో శ్రేయస్ అయ్యర్ విషయంలో డీఆర్ఎస్‌కు వెళ్లి భంగపడ్డ శ్రీలంక, ఆ తర్వాతి ఓవర్లోనే అనవసరంగా రిషబ్ పంత్ విషయంలో డీఆర్ఎస్ వెళ్లి మరోసారి భంగపడింది.
ఇలా డీఆర్ఎస్‌ల విషయంలో లంక ఆటగాళ్లు తప్పుల మీద తప్పులు చేశారు. ముఖ్యంగా ఆ జట్టు వికెట్ కీపర్ డిక్వెల్లా డీఆర్ఎస్‌ల విషయంలో ఏమాత్రం యాక్టివ్‌గా ఉండలేకపోయాడు. శ్రీలంక ప్లేయర్ల ఈ తప్పిదాలను కామెంటేటర్లు పలుమార్లు ప్రస్తావించారు. అయితే డీఆర్ఎస్‌ల విషయంలో లంక ఆటగాళ్లు చేసిన తప్పులు మాత్రం టీమిండియాకు వరంగా మారాయి.

విజయం దిశగా భారత్
ఇక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. బ్యాట్, బాల్‌తో అదరగొట్టిన రోహిత్ సేన రెండో రోజు కూడా పూర్తి అధిపత్యాన్ని ప్రదర్శించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 28 పరుగులు చేసిన శ్రీలంక విజయానికి 419 పరుగులు దూరంలో ఉంది. క్రీజులో కెప్టెన్ కరుణరత్నే (10), కుశాల్ మెండీస్ (16) ఉన్నారు. జస్ప్రీత్ బుమ్రా తొలి ఓవర్లోనే తిరిమాణేను ఎల్బీగా డకౌట్ చేశాడు. లక్ష్యం భారీగా ఉండడంతో ఈ మ్యాచ్‌లో ఇండియా విజయం ఖాయమైందనే చెప్పుకోవాలి.


Click it and Unblock the Notifications












