
బెంగళూరు: పింక్ బాల్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో చెలరేడంతో టీమిండియా 300కు పైగా పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 143 పరుగుల అధిక్యాన్ని కలుపుకుని శ్రీలంక ముందు టీమిండియా 447 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్‌ను 303-9 వికెట్ల వద్ద డిక్లేర్ చేశారు. అక్షర్ పటేల్ ఔటైన వెంటనే స్కోర్‌ను డిక్లేర్ చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 68.5 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ 67, రిషబ్ పంత్ 50, రోహిత్ శర్మ 46, హనుమ విహారీ 35, మయాంక్ అగర్వాల్ 22, రవీంద్ర జడేజా 22, విరాట్ కోహ్లీ 13, రవిచంద్రన్ 13, మహ్మద్ షమీ 16*, అక్షర్ పటేల్ 9 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో ప్రవీణ్ జయవిక్రమ 4, లసిత్ ఎంబుల్దేనియా 3, విశ్వ ఫెర్నాండో, డిసిల్వా తలో వికెట్ తీశారు. కాగా కెరీర్లో చివరి టెస్టు మ్యాచ్ ఆడిన లక్మల్ ఈ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు.
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మయాంక్‌ను ఎంబుల్దేనియా ఫెమిలియన్ చేర్చాడు. అనంతరం హనుమ విహారీతో కలిసి కెప్టెన్ రోహిత్ శర్మ రెండో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ శర్మ, హనుమ విహారీ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. వీరిని డిసిల్వ, జయవిక్రమ ఔట్ చేశారు. జట్టు స్కోర్ 139 పరుగుల వద్ద ఉండగా 13 పరుగులు చేసిన కోహ్లీని జయవిక్రమ నాల్గో వికెట్‌గా ఫెమిలియన్ చేర్చాడు. ఈ క్రమంలో పంత్, శ్రేయస్ అయ్యర్ ఐదో వికెట్‌కు 45 పరుగులు జోడించారు.
ఆ తర్వాత పంత్ అయినప్పటికీ జడేజాతో కలిసి ఆరో వికెట్‌కు శ్రేయస్ 63 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో ఈ టెస్ట్ మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. జట్టు స్కోర్ 247 పరుగుల వద్ద ఉండగా జడేజా.. 278 పరుగుల వద్ద ఉండగా అశ్విన్, శ్రేయస్ అయ్యర్ వెంటవెంటనే ఔట్ అయ్యారు. దీంతో టీమిండియా 278 పరుగులకు 8 వికెట్లు కోల్పోయింది. ఇక 303 పరుగుల వద్ద అక్షర్ తొమ్మిదో వికెట్‌గా ఔటవడంతో స్కోర్‌ను డిక్లేర్ చేశారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 252 పరుగులకు, శ్రీలంక 109 పరుగులకు ఆలైటైన సంగతి తెలిసిందే.