
ఓపెనర్లు శుభారంభం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు. ఆ జట్టు ఓపెనర్లు దనుష్క గుణతిలక, పాతుమ్ నిస్సాంక మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు తొలి వికెట్‌కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే తొమ్మిదో ఓవర్‌లో వరుసగా 6, 4, 6 బాది జోరు మీదున్న దనుష్క గుణతిలకను జడేజా ఔట్ చేశాడు. దీంతో టీమిండియాకు తొలి వికెట్ దక్కింది. గుణతిలక 38 పరుగులు చేసి ఔటయ్యాడు.

తుమ్ నిస్సాంక హాఫ్ సెంచరీ
ఆ తర్వాత వచ్చిన చరిత్ అసలంక (2), కమిల్ మిషారా (1), దినేష్ చండిమాల్ (9) వెంటవెంటనే ఔటయ్యారు. వీరిని యజుర్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా ఔట్ చేశారు. దీంతో శ్రీలంక 14.4 ఓవర్లలో 102 పరుగులుకు 4 వికెట్లు కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్న లంక ఎపెనర్ పాతుమ్ నిస్సాంక మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 23 ఏళ్ల నిస్సాంకకు టీ20 కెరీర్లో ఇది ఐదో హాఫ్ సెంచరీ.

చెలరేగిన నిస్సాంక, షనక
అనంతరం కెప్టెన్ దసున్ షనకతో కలిసి నిస్సాంక స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 26 బంతుల్లోనే 56 పరుగులు జోడించారు. వరుస బౌండరీలతో చెలరేగి ఆడారు. ఈ క్రమంలో తుమ్ నిస్సాంక కెరీర్ బెస్టు స్కోర్‌ను నమోదు చేశాడు. అయితే జట్టు స్కోర్ 160 పరుగుల వద్ద ఉండగా 75 పరుగులతో చెలరేగుతున్న తుమ్ నిస్సాంకను ఐదో వికెట్‌గా 19వ ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ కుమార్ ఎల్బీడబ్ల్యూలో ఔట్ చేశాడు. తుమ్ నిస్సాంక ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు ఉన్నాయి.

చివరి ఓవర్‌లో
ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక చెలరేగాడు. హర్షల్ పటేల్ వేసిన ఆ ఓవర్‌లో ఏకంగా 23 పరుగులు రాబట్టాడు. చివరి రెండు బంతులను సిక్సులు బాదాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో శ్రీలంక 5 వికెట్లు కోల్పోయి 183 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 2 ఫోర్లు, 5 సిక్సులతో 19 బంతుల్లోనే 47 పరుగులు చేసిన షనక నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జడేజా, చాహల్, బుమ్రా, భువి, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












