For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి టీ20: బారాబతి పిచ్‌ని క్షుణ్ణంగా పరిశీలించిన ధోని

By Nageshwara Rao
India vs Sri Lanka: MS Dhoni inspects Cuttack pitch, fans line up to watch India nets

హైదరాబాద్: గతేడాది కాలంగా కటక్‌లోని బారాబతి స్టేడియంలో పిచ్‌ని పెద్దగా పరీక్షించలేదు. బుధవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే తొలి టీ20కి బారాబతి స్టేడియం ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పిచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు.

గతంలో రాంచీలో టీమిండియా టెస్టు ఆడే ముందు ధోనీ వెళ్లి పిచ్‌ను పరిశీలించి వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. తాజాగా శ్రీలంకతో తొలి టీ20 నేపథ్యంలో మరోసారి పిచ్‌ను పరిశీలించాడు. ధోని పిచ్‌ను పరిశీలించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20కి బుధవారం కటక్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియా ఆటగాళ్లు పాల్గొన్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి పర్యవేక్షణలో జట్టులోని పేసర్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేయగా, బ్యాట్స్‌మెన్లు బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు.

తొలి టీ20 జరుగుతున్న బారాబతి స్టేడియం 2015లో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఓ అంతర్జాతీయ మ్యాచ్‌‌కు ఆతిథ్యమిస్తోన్న తరుణంలో పిచ్‌ను ధోనీ పరిశీలించాడు. అనంతరం ప్రాక్టీస్‌లో భాగంగా తన విలువైన సలహాలు, సూచనలను యువ ఆటగాళ్లకు ఇచ్చాడు.

దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని టీమిండియా సీనియర్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ, శిఖర్‌ధావన్‌, భువనేశ్వర్‌‌లకు సెలక్టర్లు విశ్రాంతి కల్పించారు. మరోవైపు వాషింగ్టన్‌ సుందర్‌, బసిల్‌ థంపి, దీపక్‌ హుడా లాంటి యువ క్రికెటర్లు ఈ సిరిస్‌లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.

పిచ్ పరిస్థితి:
2015లో ఇదే స్టేడియంలో ఓ టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో భారత్‌ ఓడింది. ఈ స్టేడియంలో తక్కువ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.

జట్ల అంచనా:
భారత్ :
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, హార్ధిక్ పాండ్యా, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, జయదేవ్

శ్రీలంక:
తిసారా పెరీరా(కెప్టెన్), నిరోషాన్ డిక్వెల్లా, ఉపుల్ తరంగ, కుశాల్ జనిత్ పెరీరా, ఏంజెలో మాథ్యూస్, అసేలా గుణరత్న, దాసున్ షనక, పతిరన, నువాన్ ప్రదీప్, విశ్వా ఫెర్నాడో, చమీరా, గుణతిలక, ధనంజయ

రాత్రి గం. 7.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌-1లో ప్రత్యక్ష ప్రసారం

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, December 20, 2017, 13:05 [IST]
Other articles published on Dec 20, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+