Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తరహా పిచ్‌లు కావివి: నాగ్‌పూర్, ఢిల్లీ పిచ్‌లపై తేల్చేసిన షమీ

India vs Sri Lanka: Mohammed Shami says team did not get right kind of tracks to prepare for South Africa tour

హైదరాబాద్: వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని లంకతో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు పిచ్‌లు రూపొందించారని వస్తున్న వార్తలపై టీమిండియా ప్రధాన పేసర్లలో ఒకడైన మహమ్మద్ షమీ స్పందించాడు.

సఫారీ పర్యటనను దృష్టిలో పెట్టుకుని పేస్ పిచ్‌లను రూపొందించామని అనడం సరైంది కాదని షమీ అన్నాడు. పేస్ పిచ్‌లను దక్షిణాఫ్రికా పర్యటనకు సన్నాహకంగా రూపొందించాలని జట్టు మేనేజ్‌మెంట్‌ను తాము కోరలేదని చెప్పుకొచ్చాడు.

ఈ తరహా పిచ్‌లపై తమ బౌలర్లు బౌలింగ్ చేస్తే మరింత రాటుదేలతారని మాత్రం షమీ స్పష్టం చేశాడు. నిజానికి బ్యాటింగ్‌ అనుకూలించే పిచ్‌లపై పేసర్లు రాణించడం అంత సులభం కాదని షమీ అన్నాడు. ఢిల్లీ వేదికగా లంకతో జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు అనంతరం షమీ మీడియాతో మాట్లాడాడు.

'దక్షిణాఫ్రికా పర్యటనను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనేజ్‌మెంట్ కోరిన పిచ్‌లు ఇవి ఎంతమాత్రం కావు. మేము కోరిన పిచ్‌లు తయారు చేయలేదు. ముఖ్యంగా నాగ్‌పూర్‌, ఢిల్లీ మ్యాచ్‌లకు సంబంధించి రూపొందించిన పిచ్‌లను దక్షిణాఫ్రికా పర్యటనకు దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్లు లేవు' అని షమీ తెలిపాడు.

'లంకేయులతో సిరీస్‌కు బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లు రూపొందించమని కోరిన మాట వాస్తవమే. దక్షిణాఫ్రికా సిరీస్‌ను దృష్టిలో పెట్టుకునే బౌలింగ్‌ ట్రాక్‌లు రూపొందించమన్నాం. కాకపోతే ఎటువంటి పచ్చిక లేని పిచ్‌లు రూపొందించారు' అని షమీ పేర్కొనడ్ం విశేషం.

మూడోరోజైన సోమవారం 24 ఓవర్లు వేసిన షమీ రెండు వికెట్లు తీసుకున్నాడు. 'భారత్‌లో సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు ఇక్కడి పిచ్‌లు పేసర్లకు చాలా తక్కువగా అనుకూలిస్తాయి. అయితే గతంలో పోలిస్తే ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. అంతకముందు 12-14 ఓవర్ల వేసే పేసర్లు, ఇప్పుడు 20 నుంచి 25 ఓవర్లు వేసే స్థాయికి పిచ్‌లు రూపొందిచబడ్డాయి' అని షమీ అన్నాడు.

'దీంతో మన స్కిల్స్‌ను చూపించే అవకాశం దక్కింది. ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయడం వల్ల ఎక్కువ వికెట్లు సాధించే అవకాశం ఉంది' అని షమీ తెలిపాడు. నిజానికి లంకతో టెస్టు సిరిస్ ప్రారంభానికి ముందు నుంచే భారత జట్టు దక్షిణాఫ్రికా పర్యటన గురించి ఆలోచిస్తూ వచ్చింది.

సఫారీ పర్యటనకు సన్నాహకంగా లంకతో 3 టెస్టుల కోసం పచ్చిక ఉన్న పేస్‌ పిచ్‌లను సిద్ధం చేస్తున్నట్లు కూడా చెప్పారు. అయితే నాగ్‌పూర్‌, ఢిల్లీ పిచ్‌లు బ్యాటింగ్‌ అనుకూలంగా ఉన్నవి మాత్రమే తయారు చేయడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, December 5, 2017, 12:57 [IST]
Other articles published on Dec 5, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+