
ఓపెనర్లు మళ్లీ విఫలం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే అనవసరమైన పరుగుకు ప్రయత్నించి 4 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్నట్లే కనిపించినప్పటికీ ఎంబుల్దేనియా వేసిన అద్భుతమైన బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ ధనుంజయ డిసిల్వాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 25 బంతులు ఎదుర్కొన్న రోహిత్ శర్మ ఓ ఫోర్, ఓ సిక్సుతో 15 పరుగులు మాత్రమే చేసి మరోసారి నిరాశపరిచాడు. దీంతో టీమిండియా 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. తొలి టెస్టులోనూ ఓపెనర్లు రాణించలేకపోయారు.

మళ్లీ నిరాశపర్చిన కోహ్లీ
ఈ క్రమంలో తెలుగు కుర్రాడు హనుమ విహారీ, విరాట్ కోహ్లీ టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 47 పరుగులు జోడించారు. ఇద్దరు క్రీజులో కుదురుకున్నట్టే కనిపించారు. ఈ క్రమంలో 31 పరుగులు చేసిన హనుమ విహారీ.. జయవిక్రమ బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. విహారీ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు ఉన్నాయి. ఆ కాసేపటికే 23 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ కూడా దనుంజయ డిసిల్వా బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో కోహ్లీ మరోసారి సెంచరీ చేయకుండానే ఫెమిలియన్ చేరడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. క్రీజులోకి వచ్చాక మంచి టచ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ తన ఫెవరేట్ కవర్‌డ్రైవ్ షాట్లతో ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 48 బంతులు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ 2 ఫోర్లతో 23 పరుగులు చేశాడు.

పంత్ దూకుడు
హనుమ విహారీ ఔటయ్యాక క్రీజులో వచ్చిన రిషబ్ పంత్ తన సహజ శైలిలోనే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఎదుర్కొన్న రెండు, మూడో బంతులను ఫోర్లు బాదాడు. 9 బంతుల్లోనే 16 పరుగులు చేసి అజేయంగా క్రీజులో ఉన్నాయి. పంత్‌కు తోడు శ్రేయస్ అయ్యర్ (1) ఉన్నాడు. లంచ్ బ్రేక సమయానికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.

తుది జట్లు
శ్రీలంక: దిముత్ కరుణరత్నె(కెప్టెన్), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.
భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.


Click it and Unblock the Notifications












