
హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం టీమిండియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. లీడ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఒక మార్పుతో శ్రీలంకతో బరిలోకి దిగుతోంది. మరోవైపు కోహ్లీ సైతం టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకుంటానని తెలిపాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
టీమిండియా సైతం రెండు మార్పులు చేసింది. చాహల్‌కు విశ్రాంతినిచ్చి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులోకి చోటు కల్పించినట్లు కోహ్లీ చెప్పాడు. వర్క్ లోడ్ కారణంగా మహ్మద్ షమీ స్థానంలో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. టీమిండియా ఇప్పటికే సెమీస్‌కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే, ఈ మ్యాచ్‌లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది.
టీమిండియా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో ఆరింట విజయం సాధించి 13 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. కోహ్లీసేనకు పట్టకిలో అగ్రస్థానం దక్కాలంటే లంకపై నెగ్గితే సరిపోదు, సాయంత్రం 6 గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా (14 పాయింట్లు) దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవాలి.
అప్పుడే టీమిండియా 15 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది గనుక జరిగితే అగ్రస్థానంలో ఉన్న టీమిండియా నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో సెమీస్ మ్యాచ్ ఆడుతుంది. అలా కాకుండా రెండో స్థానంలో నిలిస్తే ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ ఆడుతుంది. పటిష్ట ఇంగ్లాండ్ కంటే న్యూజిలాండ్‌తో ఆడాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా భారత్, శ్రీలంక జట్లు ఇప్పటివరకు 158 మ్యాచ్‌లు ఆడాయి. 90 మ్యాచ్‌ల్లో భారత్.. 56 మ్యాచ్‌ల్లో శ్రీలంక గెలిచాయి. ఒక మ్యాచ్ 'టై' అయింది. ఇక 11 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మరోవైపు ప్రపంచకప్‌లో ఈ రెండు జట్ల మధ్య 8 మ్యాచ్‌లు జరిగాయి. 3 మ్యాచ్‌ల్లో భారత్.. 4 మ్యాచ్‌ల్లో శ్రీలంక నెగ్గాయి. మరో మ్యాచ్ రద్దయింది.
జట్ల వివరాలు
టీమిండియా: రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రిషబ్ పంత్, ధోనీ, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
శ్రీలంక: దిముత్ కరుణరత్నే (కెప్టెన్), కుశాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, ఏంజిలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వా, ఉరుసు ఉదాన, లసిత్ మలింగ, కాసున్ రజిత, జెఫ్రీ వాండర్సే.
{headtohead_cricket_3_7}