Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన కోహ్లీసేన: 3-0తో లంకపై సిరిస్ క్లీన్ స్వీప్

హైదరాబాద్: కోహ్లీ సేన చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 171 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.

మొద‌టి, రెండవ టెస్టుల్లోనూ గెలిచిన కోహ్లీసేన చివ‌రిదైన మూడో టెస్టులోనూ గెల‌వ‌డంతో విదేశీ గ‌డ్డ‌పై తొలిసారి టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి సరికొత్త రికార్డును సాధించింది. మూడో టెస్టులో కోహ్లీ సేన విజయం సాధించడంతో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన జట్టుగా కోహ్లీసేన నిలిచింది.

 Kohli and Co aim to complete whitewash

భారత జట్టు తన 85 ఏళ్ల టెస్టు చరిత్రలో విదేశాల్లో మూడు టెస్టుల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన దాఖలాలు లేవు. ఆ రికార్డును ఇప్పుడు కోహ్లీసేన తన ఖాతాలో వేసుకుంది. పల్లెకలె వేదికగా శనివారం ఆరంభమైన చివరి టెస్టులో పూర్తిస్థాయి‌ ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ మరో రెండు రోజులు మిగిలి ఉండగానే నెగ్గింది.

సోమవారం ఓవర్ నైట్ స్కోరు 19/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక భారత్ బౌలర్లు అశ్విన్ (68/3), షమీ (3/32) ధాటికి 181 పరుగులకే ఆలౌటైంది. శ్రీలంక జట్టులో డిక్వెల్లా (41) ఒక్కడే చెప్పుకోదగ్గ పరుగులు చేశాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 487 పరుగులకు ఆలౌటైంది.

శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే ఆలౌటైంది. ఆనంతరం ఫాలో‌ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ధావ‌న్ (119), పాండ్యా (108) సెంచ‌రీలు చేయ‌డంతో భార‌త్ భారీ స్కోరు సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు హార్దిక్ పాండ్యాకు ద‌క్క‌గా.. సిరీస్‌లో రెండు సెంచ‌రీలు స‌హా మొత్తం 358 ర‌న్స్ చేసిన శిఖ‌ర్ ధావ‌న్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద‌క్కింది.

టెస్టు సిరిస్ అనంతరం ఆగస్టు 20 నుంచి శ్రీలంక-భారత్ జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.


మూడో రోజు శ్రీలంక బ్యాటింగ్ తీరు సాగిందిలా:

అశ్విన్ 'స్పిన్' మాయాజలం
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశ్విన్ తన 'స్పిన్' మాయాజాలాన్ని ప్రదర్శిస్తున్నాడు. మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక స్వల్ప విరామంలో వికెట్లను చేజార్చుకుంటుంది. ముఖ్యంగా స్పిన్నర్‌ అశ్విన్‌ లంక పతనాన్ని శాసిస్తున్నాడు. తన స్పిన్‌ మాయాజాలంతో కరుణరత్నె (16), ఏంజెలో మాథ్యూస్‌ (35), పెరీరా (8)ను పెవిలియన్‌ పంపించాడు. దీంతో 73 ఓవర్లకు గాను శ్రీలంక 9 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. ప్రస్తుతం ఫెర్నాడో 3, కుమార 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

Ashwin

చారిత్రాత్మ‌క విజ‌యానికి చేరువలో కోహ్లీసేన
కోహ్లీసేన విజయానికి చేరువైంది. మరో మూడు వికెట్లు తీస్తే 85 ఏళ్ల టెస్టు క్రికెట్‌ను సొంతం చేసుకుంటుంది. ఫాలోఆన్‌లో 39 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన లంకను కెప్టెన్ దినేశ్‌ చండిమాల్‌ (36), ఏంజెలో మాథ్యూస్‌ (35) ఆదుకున్నారు. వికెట్ పడకుండా భారత బౌలర్లను ఎదుర్కొన్నారు.

దీంతో ఐదో వికెట్‌కు 65 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని కుల్దీప్ విడదీశాడు. 48 పరుగుల వద్ద దినేశ్ చండీమాల్‌ను అవుట్ చేయడం ద్వారా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత తర్వాత నాలుగు పరుగులకే మాథ్యూస్‌ను అశ్విన్‌ పెవిలియన్‌ పంపాడు.

Kuldeep Yadav

అనంతరం క్రీజులోకి వచ్చిన పెరీరా 8 పరుగుల వద్ద అశ్విన్‌ బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో భారత్ విజయానికి ఇంకా 3 వికెట్లు దూరంలో ఉంది. దీంతో 67 ఓవర్లకు గాను శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ప్రస్తుతం సందకన్ 4, డిక్వెలా 36 పరుగులతో క్రీజులో ఉన్నారు.

లంచ్ విరామ సమయానికి శ్రీలంక 82/4

శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసే దిశగా కొనసాగుతోంది. దీంతో చారిత్రాత్మ‌క విజ‌యానికి కోహ్లీసేన ఆరు వికెట్ల దూరంలో ఉంది. శ్రీలంక‌తో జ‌రుగుతున్న మూడో టెస్ట్‌లో గెలిస్తే విదేశీ గ‌డ్డ‌పై టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన తొలి భార‌త జ‌ట్టుగా కోహ్లీ సేన నిల‌వ‌నుంది.

లంచ్ విరామ సమయానికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ప్రస్తుతం చండీమాల్ 26, మాథ్యూస్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. శ్రీలంక ఇంకా 270 పరుగుల వెనుకంజలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 135 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన శ్రీలంక‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే త‌డ‌బాటును కొన‌సాగిస్తోంది.

ఓవర్ నైట్ స్కోరు 19/1తో సోమవారం రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న శ్రీలంకకు తొలి సెషన్ ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు కరుణరత్నే16, పుష్పకుమార 1, కుశాల్ మెండిస్ 12లను స్వల్ప విరామాల్లో భారత బౌలర్లు పెవిలియన్‌కు పంపారు.

ఫాలో ఆన్ ఆడుతున్న శ్రీలంక జట్టు 39 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తరుణంలో సీనియ‌ర్ బ్యాట్స్‌మ‌న్ మాథ్యూస్ (17 నాటౌట్‌)తో క‌లిసి కెప్టెన్ చండీమాల్ (26 నాటౌట్‌)తో ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికే ఐదో వికెట్‌కు అజేయంగా 43 ప‌రుగులు జోడించారు.

భారత బౌలర్లలో మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీసుకోగా, అశ్విన్, ఉమేశ్ యాదవ్ చెరో వికెట్ తీశారు.

రెండో వికెట్‌ కోల్పోయిన శ్రీలంక

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ కరుణరత్నె16 పరుగుల వద్ద అశ్విన్‌ బౌలింగ్‌ రహానేకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 19/1తో మూడోరోజు ప్రారంభించిన శ్రీలంక 16 ఓవర్లు ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. ప్రస్తుతం పుష్పకుమార్‌, మెండిస్‌ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. శ్రీలంక ఇంకా 326 పరుగులు వెనుకబడి ఉంది.

మూడోరోజు ఆట ప్రారంభం
పల్లెకెలె వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 19/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో శ్రీలంక ఆట ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 487 పరుగులకు ఆలౌట్‌ కాగా శ్రీలంక 135 పరుగులకే ఆలౌటైంది. దీంతో శ్రీలంక ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతోంది.

రెండో ఇన్నింగ్స్‌లో జట్టు స్కోరు 9 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం కరుణరత్నె 12, పుష్పకుమార పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు. శ్రీలంక ఇంకా 333 పరుగులు వెనుకబడి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కోహ్లీసేన సిరిస్‌ను క్లీన్ స్వీప్ చేసినట్లు అవుతుంది.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+