For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసక్తికరంగా రెండో టెస్టు: మెండిస్ సెంచరీ, ఫాలో ఆన్‌లో లంక 209/2

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. 
 భారత్ బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య శ్రీలంక 183 పరుగులకే ఆలౌటైంది. 

By Nageshwara Rao

హైదరాబాద్: కొలంబో వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ప్రస్తుతం కరుణరత్నే 92, పుష్పకుమార 2 పరుగులతో ఉన్నారు. దీంతో శ్రీలంక ఇంకా 230 పరుగులు వెనుకబడి ఉంది. అంతకుముందు సెంచరీ అనంతరం కుశాల్ మెండిస్ 110 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పాండ్యా బౌలింగ్‌లో సాహాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 183 పరుగులకు ఆలౌట్ కాగా భారత్‌కు 439 పరుగుల భారీ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. దీంతో లంక జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, హార్ధిక్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కింది.

సెంచరీతో మెరిసిన కుశాల్ మెండిస్
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొత్త మలుపు తిరిగింది. 7 పరుగులకే ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ (2) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కుశాల్‌ మెండిస్‌ సెంచరీతో చెలరేగాడు. 123 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 102 పరుగులు చేశాడు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 46వ ఓవర్‌ చివరి బంతికి బౌండరీతో సెంచరీ సాధించాడు. ఈ జోడీని విడదీసేందుకు చేసిన భారత బౌలర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీలంక 49 ఓవర్లకు వికెట్ నష్టపోయి 185 పరుగులతో ఉంది.

శ్రీలంక ఇంకా 254 పరుగులు వెనకబడి ఉంది. మరో ఓపెనర్‌ కరుణ రత్నె (80) చక్కని సహకారం అందిస్తున్నాడు. ఓపెనర్ కరుణ రత్నేతో కలిసి 170 పరుగులకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. ఈ జోడి 50 ఓవర్లకి పైగా క్రీజులో నిలబడి లంక ఇన్నింగ్స్ ను చక్కదిద్దింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 183 పరుగులకు ఆలౌట్ కాగా భారత్‌కు 439 పరుగుల భారీ ఆధిక్యం లభించిన సంగతి తెలిసిందే. దీంతో లంక జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. లంక జట్టు ఓటమి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని కీలక భాగస్వామ్యాలు అవసరం.

నిలకడగా ఆడుతోన్న శ్రీలంక
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో లంక రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతోంది. ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే లంక ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన మెండీస్‌ మరో ఓపెనర్‌ కరుణరత్నేతో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దుతున్నాడు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్నారు. దీంతో ఈ ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేశారు. 28 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్‌ నష్టానికి 118 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కరుణరత్నే(55), మెండీస్‌(61) ఉన్నారు.

శ్రీలంక 183 ఆలౌట్

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. భారత్ బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య శ్రీలంక లంచ్ విరామ సమయానికి 49.4 ఓవర్లకు 183 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. శనివారం 50/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడోరోజు ఆట ప్రారంభించిన శ్రీలంక మరో 133 పరుగులు మాత్రమే చేసి మిగిలిన 8 వికెట్లు కోల్పోయింది.

India vs Sri Lanka Live Score, 2nd Test, Day 3: Ashwin grabs fifer; SL bundled out for 183

దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 439 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. శ్రీలంక‌ ఫాలోఆన్ ఆడ‌నుంది. తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 50 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేకపోయింది. లంక బ్యాట్స్‌మెన్లలో డిక్‌విల్లా ఒక్క‌డే హాఫ్ సెంచ‌రీ చేశాడు. 50/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక బ్యాట్స్‌మెన్‌పై భారత్ బౌలర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు.

భార‌త బౌల‌ర్లు క్ర‌మ‌క్ర‌మంగా వికెట్ల‌ను తీశారు. ఏంజెలో మ్యాథ్యూస్(26), ధనంజయ డిసిల్వా(0), నిరోషాన్ డిక్ వెల్లా(51), రంగనా హెరాత్(2) స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపింది. ఐదో బౌలర్ అవసరమే లేకుండా నలుగురు బౌలర్లే లంకను ఆలౌట్ చేశారు. భారత బౌలర్లలో రవిచంద్రన్‌ అశ్విన్‌ 5 వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి రెండో రెండు వికెట్లు తీశారు. తద్వారా కెరీర్‌లో 26వ సారి ఈ ఫీట్ ను సాధించాడు. దీంతో హర్భజన్ (25 సార్లు)ను అధిగమించాడు. భారత బౌలర్లలో అనిల్‌కుంబ్లే మొత్తం 35 సార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను సాధించాడు.

ఈ టెస్టులో టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసుకున్న రెండ‌ో ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా జ‌డేజా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 9 వికెట్ల‌కు 622 ర‌న్స్ చేసి డిక్లేర్ చేసిన విష‌యం తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+