
వర్షంతో ముందుకొచ్చిన లంచ్ విరామం
కోలకతాలో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో రెండో రోజు వర్షం రావడంతో ఆటను అంఫైర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో టీ విరామం లేకుండానే భోజన విరామాన్ని ముందుకు తెచ్చారు. వర్షం వచ్చి మ్యాచ్ నిలిచే సమయానికి భారత్ 32.5 ఓవర్లకు గాను 5 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది.
ఛటేశ్వర్ పుజారా (47) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతనికి తోడుగా వృద్ధిమాన్ సాహా (6) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 17/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్ 30 పరుగుల వద్ద రహానె (4), 50 వద్ద అశ్విన్ (4) వికెట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే.
కుప్పకూలిన టాపార్డర్: భారత్ 60/5
తొలిటెస్టులో టీమిండియా కష్టాల్లో పడింది. 17/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. రహానే (4) పెవిలియన్‌కు చేరగా... అతడి అనంతరం క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్‌మన్ రవిచంద్రన్ అశ్విన్ (4) సైతం ఔటయ్యాడు.
26వ ఓవర్ చివరి బంతికి కరుణరత్నెకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 30 ఓవర్లు ముగిసే సరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. క్రీజులో పుజారా (39), వృద్ధిమాన్ సాహా పరుగులేమీ చేయకుండా ఉన్నాడు. శ్రీలంక బౌలర్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు.
తొలి టెస్టులో రెండోరోజు మొదలైన ఆట
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. ఓవర్ నైట్ స్కోరు 17/3తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా కష్టాల్లో పడింది. 20 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది.
ఇండియా Vs శ్రీలంక తొలి టెస్టు స్కోరు కార్డు
క్రీజులో కుదురుకోవడానికి ప్రయత్నిస్తున్న రహానేను 4 పరుగుల వద్ద శ్రీలంక బౌలర్ దాసున్ షనకా పెవిలియన్‌కు చేర్చాడు. ప్రస్తుతం క్రీజులో అశ్విన్ 4, పుజారా 24 పరుగులతో ఉన్నారు. 24 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయిన టీమిండియా 45 పరుగులు చేసింది.
ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితి చూస్తుంటే భారత్‌ను పుజారానే ఆదుకోవాలేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈడెన్ పిచ్ ఇప్పుడు బౌలర్లకు అనుకూలంగా ఉంది. దానిని శ్రీలంక సద్వినియోగం చేసుకుంటోంది. ప్రస్తుతం టీమిండియా ఆటను చూస్తుంటే ఈ పిచ్‌పై కనీసం 200 దాటినా శ్రీలంకకు గట్టి పోటీ ఇచ్చినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
కాగా, తొలిరోజు మొత్తం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 11.5 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ డకౌటయ్యారు. ధావన్ 8 పరుగులు చేయగా.. పుజారా 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. వర్షం, మైదానం చిత్తడిగా ఉండటంతో తొలి సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది.
లంచ్ సమయం తర్వాత మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. ఆటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే రాహుల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ధావన్ ఔటయ్యాడు. విరాట్ కోహ్లి కూడా ఖాతా తెరవకుండానే.. లక్మల్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు.
దీంతో భారత్ 17 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కోహ్లి కూడా 11 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్ 6 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు.