Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా టెస్టు: రెండో రోజూ వరుణుడిదే, పుజారా ఒంటరి పోరాటం

India Vs Sri Lanka, Kolkata Test, Day 2: India wobble against seam before rain washes out second day

హైదరాబాద్: శ్రీలంకతో కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. వరుణుడు అడ్డంకిగా మారిని ఈ టెస్టు తొలి రోజు కేవలం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా.. రెండో రోజు 21 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 74/5తో ఉంది.

వర్షం కారణంగా తొలిరోజైన గురువారం రోజంతా తుడుచుపెట్టుకుపోవడంతో శుక్రవారం ఉదయం 9 గంటలకే మ్యాచ్‌ను మొదలుపెట్టారు. రెండు గంటలపాటు వరుణుడు తెరపివ్వడంతో ఈ మాత్రం ఆటన్నా సాధ్యమైంది. గురువారం 17 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.... శుక్రవారం మరో రెండు వికెట్లు కోల్పోయింది.

ఓవర్‌నైట్‌ స్కోరు 17/3తో బ్యాటింగ్‌ కొనసాగించిన కోహ్లీసేనకు రెండోరోజు శుభారంభం దక్కలేదు. 17/3 ఓవర్‌నైట్‌ స్కోరుతో శుక్రవారం ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందే రెండు కీలక వికెట్లు చేజార్చుకుంది. రహానే (4) పెవిలియన్‌‌కు చేరగా... అతడి అనంతరం క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్‌మన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (4) సైతం ఔటయ్యాడు.

26వ ఓవర్‌ చివరి బంతికి కరుణరత్నెకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఛటేశ్వర్ పుజారా (47) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. అతనికి తోడుగా వృద్ధిమాన్‌ సాహా (6) పరుగులతో క్రీజులో ఉన్నాడు. శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో మొదలైన వర్షం ఆ తర్వాత క్రమంగా పెరిగింది.

2.5 ఓవర్ల దగ్గర మరోసారి వర్షం రావడంతో మ్యాచ్‌ను నిలిపేశారు. వర్షం మధ్యలో కొంత తెరపినివ్వడంతో సిబ్బంది సూపర్‌ సోపర్లతో నీటిని బయటకు తోడేందుకు శ్రమించారు. అంతలోనే మళ్లీ వర్షం మొదలైంది. వర్షం మళ్లీ.. మళ్లీ కురవడం, వెలుతురు లేమి వల్ల రెండో రోజు ఆటను అంపైర్లు పూర్తిగా నిలిపేశారు.

వర్షం వచ్చి మ్యాచ్ నిలిపివేసే సమయానికి భారత్ 5 వికెట్లకు 74 పరుగులు చేసింది. పుజారాకు తోడు సాహా (6 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. రెండో రోజు ఉదయం కూడా లంక బౌలర్లు జోరు కొనసాగించారు. పిచ్, వాతావరణం బౌలింగ్‌కు అనుకూలించాయి. తొలిరోజు లక్మల్ మూడు వికెట్లు తీయగా... రెండోరోజు మరో పేసర్ షనకా రెండు వికెట్లు తీశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, November 17, 2017, 15:49 [IST]
Other articles published on Nov 17, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+