Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోల్‌కతా టెస్టు, తొలిరోజు: 11.5 ఓవర్లు.. 17 పరుగులు.. 3 వికెట్లు

Srilanka

హైదరాబాద్: కోల్‌కతా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలిరోజు వరుణుడి హవా కొనసాగింది. దీంతో తొలిరోజు మొత్తం 11.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఉదయం నుంచి మ్యాచ్‌కి వరుణుడు అడ్డంకిగానే మారాడు. బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా ఉన్న పిచ్‌పై టీమిండియా తడబడింది.

11.5 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ రాహుల్, కెప్టెన్ కోహ్లీ డకౌటయ్యారు. ధావన్ 8 పరుగులు చేయగా.. పుజారా 8 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. వర్షం, మైదానం చిత్తడిగా ఉండటంతో తొలి సెషన్ అంతా తుడిచిపెట్టుకుపోయింది.

లంచ్ సమయం తర్వాత మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. ఆటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో తొలి బంతికే రాహుల్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ధావన్ ఔటయ్యాడు. కెప్టెన్ కోహ్లి కూడా 11 బంతులు ఆడి ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మల్ 6 ఓవర్లు వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా 3 వికెట్లు తీశాడు.

కోల్ కతా టెస్టులో కోహ్లీ డకౌట్

భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే మళ్లీ నిలిచిపోయింది. వర్షం, వెలుతురు సరిగా లేని కారణంగా 8.2 ఓవర్ల వద్ద మ్యాచ్‌ను అంపైర్లు సుమారు గంటపాటు నిలిపివేశారు. అనంతరం మ్యాచ్‌ ప్రారంభమైన కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. ధావన్‌ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ 11 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.

భారత్ కోల్పోయిన మూడు వికెట్లు కూడా శ్రీలంక బౌలర్ లక్మల్‌కే దక్కాయి. 11.5 ఓవర్‌ వద్ద గమేజ్‌ వేసిన బంతిని ఎదుర్కొనేందుకు పుజారా కాస్త ఇబ్బందిపడ్డాడు. దీంతో వెలుతురు సమస్య ఉందని అంపైర్లకు సూచించాడు. దీంతో పరీక్షించిన అంపైర్లు మ్యాచ్‌ను మరోసారి నిలిపివేశారు. ఈ సమయానికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా(8), రహానే పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.

Kohli

వెలుతురులేమి, వర్షం అడ్డంకిగా మారడంతో మ్యాచ్ నిలిపివేత
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టును వర్షం కారణంగా ఇప్పటికే రెండుసార్లు నిలిపివేశారు. వర్షం అడ్డంకిగా మారడంతో గురువారం మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభమైన కొంతసేపటికి వెలుతురు లేమి సమస్య కూడా ఎదురవ్వడంతో అంపైర్లు మ్యాచ్‌ను ఆపివేశారు. మైదానాన్ని కవర్లతో మైదానాన్ని కప్పి ఉంచారు. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 8, కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

తొలి బంతికే కేఎల్ రాహుల్ ఔట్
కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. వర్షం కారణంగా మ్యాచ్‌ ఆలస్యంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. భారత ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్‌లు ఇన్నింగ్స్ ఆరంభించారు. శ్రీలంక బౌలర్‌ సురంగ లక్మల్‌ వేసిన తొలి బంతికే ఓపెనర్‌ రాహుల్‌ ఔటయ్యాడు.

సురంగ లక్మల్ వేసిన బాల్ కాస్త స్వింగ్ అవడంతో వదిలేయడానికి వెళ్లినా అది రాహుల్ గ్లోవ్స్‌ను తగిలి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. దీంతో తొలి బంతికే అతను డకౌట్‌గా వెనుదిరిగాడు. టెస్టు క్రికెట్‌లో ఇలా తొలి బంతికే అవుటైన భారత ఆటగాళ్ల జాబితాలో సునీల్‌ గావస్కర్‌(3 సార్లు) అగ్రస్ధానంలో నిలవగా, సుధీర్‌ నాయక్‌, డబ్ల్యూవీ రమన్‌, ఎస్‌ఎస్‌ దాస్‌, జాఫర్‌, కేఎల్‌ రాహుల్‌ ఆ తర్వాతి స్ధానాల్లో నిలిచారు.

ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ధావన్ (8) కూడా ఔటయ్యాడు. ఈ రెండు వికెట్లు లంక బౌలర్‌ లక్మల్‌కే దక్కాయి. అయితే 8.2 ఓవర్లకు గాను 2 వికెట్లు కోల్పోయి భారత్ 17 పరుగులు ఉన్న సమయంలో మరోసారి వర్షం పడటంతో మ్యాచ్ నిలిచిపోయింది. ప్రస్తుతం క్రీజులో పుజారా 8, కోహ్లీ పరుగులేమీ చేయకుండా ఉన్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
కోల్‌కతా వేదికగా భారత్-శ్రీలంక జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమాల్ కోహ్లీసేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

వర్షం కారణంగా టాస్ ఆలస్యం
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగాల్సి ఉంది. ఈ ఉదయం 9 గంటలకు ప్రారంభం కావాల్సిన మ్యాచ్ వాతావరణం అనుకూలించని కారణంగా ఇంకా ప్రారంభం కాలేదు.

అయితే కోల్‌కతాలో చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుండటంతో 9 గంటలకు వేయాల్సిన టాస్ కూడా ఇంకా పడలేదు. ఉదయం 9.30 గంటల వరకూ సూర్యుడు కూడా కనిపించలేదు. మరోవైపు, ఈ మ్యాచ్‌కి క్రికెట్ అభిమానుల నుంచి పెద్దగా స్పందన లేకపోవడం గమనార్హం.

ఇండియా Vs శ్రీలంక తొలి టెస్టు స్కోరు కార్డు

అందుబాటులో ఉంచిన టికెట్లలో 20 శాతం కూడా అమ్ముడు కాలేదని తెలుస్తోంది. మంచు పూర్తిగా ఆరిన తరువాతనే టాస్ వేసి, మ్యాచ్‌ని ప్రారంభించాలని అంపైర్లు నిర్ణయించారు. ఈ క్రమంలో అంఫైర్లు మ్యాచ్‌ని నిలిపివేశారు. మరోవైపు గ్రౌండ్ సిబ్బంది మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేస్తున్నారు.

మైదానం మొత్తాన్ని సిబ్బంది కవర్లతో కప్పి ఉంచారు. దీంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లందరూ డ్రస్సింగ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో శనివారం వరకూ కొనసాగుతుండటంతో కోల్‌కతాలో వాతావరణం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీంతో బుధవారం ఉదయం కూడా వర్షం కారణంగా టీమిండియా ప్రాక్టీస్‌ సెషన్‌ రద్దు అయిన సంగతి తెలిసిందే.

దీంతో గురువారం, శుక్రవారం కోల్‌కతాలోని పలు చోట్ల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. దీంతో తొలి టెస్టుకు వరుణుడు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. అయితే, చిరుజల్లులు మ్యాచ్‌కు ఏ మాత్రం ఆటంకం కలిగించవని కోల్‌కతా క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) గ్రౌండ్ కమిటీ హెడ్ దేబబ్రతా దాస్ తెలిపారు.

నాలుగు గంటలపాటు వర్షం కురిసినా కూడా 20 నిమిషాల్లోనే నీటిని బయటకు తోడేస్తామని ఆయన ధీమాగా చెప్పారు. పిచ్ కవర్లపై నిలిచిన నీటిని పీల్చే యంత్రాలను తెప్పించామని ఆయన తెలిపారు. వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోకుండా ఉండేందుకు అత్యాధునిక యంత్రాలు తమ వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు.

వర్షం నీరు మైదానంలో నిలవకుండా ఉండేందుకు నీటిని పీల్చే సూపర్ సోప్పర్లు యంత్రాలతో నీటిని తోడేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఇదిలా ఉంటే భారత గడ్డపై శ్రీలంక ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా గెలవలేదు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, November 16, 2017, 17:00 [IST]
Other articles published on Nov 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+