
కొలంబో టెస్టులో రాహుల్ హాఫ్ సెంచరీ
కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ(57)తో రాణించిన సంగతి తెలిసిందే. టెస్టుల్లో రాహుల్‌కు ఇది వరుసగా ఆరో హాఫ్ సెంచరీ కావడం విశేషం. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత ఆటగాడిగా రాహుల్ గుర్తింపు పొందాడు.

గాయం అనంతరం ఆత్మవిశ్వాసం
తొలి ఇన్నింగ్స్ అనంతరం తన ప్రదర్శనపై సంతృప్తిని వ్యక్తం చేసిన కేఎల్ రాహుల్ అందుకు కారణం కెప్టెన్ విరాట్ కోహ్లీనే అని పేర్కొన్నాడు. గాయం అనంతరం తనలో ఆత్మవిశ్వాసం పెరిగి రాణించడానికి కోహ్లీ ఇచ్చిన సపోర్టే కారణమని చెప్పాడు.

క్రికెటర్ల నుంచి లభించిన మద్దతు మరువలేనిది
'వారిచ్చిన మద్దతు నాలో తేడా తీసుకొచ్చింది. నేను గాయంతో కొన్ని నెలల పాటు జట్టుకు దూరమైన తరువాత సహచర క్రికెటర్ల నుంచి లభించిన మద్దతు మరువలేనిది. సహాయక సిబ్బంది కూడా అండగా నిలిచారు. నేను సర్జరీ చేయించుకున్న తరువాత నా పరిస్థితిని తోటి క్రికెటర్లు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ ఉండేవారు' అని పేర్కొన్నాడు.

ఆత్మవిశ్వాసాన్ని పెంచిన కోహ్లీ
'ఇక్కడ ప్రధానంగా కోహ్లీ నుంచి చక్కటి సహకారం లభించింది. నీ కోసం జట్టు నిరీక్షిస్తుందంటూ మెస్సేజ్‌లతో నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. ఇదే నేను భయం లేకుండా తిరిగి జట్టులో అడుగుపెట్టడానికి కారణమైంది. వారు చూపించిన సహాకారం నా చిన్న కెరీర్‌లో కచ్చితంగా చాలా పెద్దది. నాకు ప్రతీ విషయంలో కోహ్లీ అండగా నిలిచాడు' అని రాహుల్ పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications