For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs Sri Lanka: పింక్ బాల్ టెస్టులో మొద‌ట‌ మ‌న‌దే బ్యాటింగ్‌.. జ‌యంత్ ఔట్‌, అక్ష‌ర్ ప‌టేల్ ఇన్!

India vs Sri Lanka: Jayant yadav out, axar patel in.. India Won The Toss And Elected to Bat First

బెంగ‌ళూరు: శ్రీ‌లంక‌తో రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. డే అండ్ నైట్ మ్యాచ్‌గా జ‌రుగుతున్న ఈ టెస్టులో టీమిండియా మొద‌టి మ్యాచ్‌తో పోలిస్తే ఒక మార్పుతో బ‌రిలోకి దిగుతుండ‌గా.. శ్రీ‌లంక రెండు మార్పుల‌తో బ‌రిలోకి దిగుతుంది.

రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నాడంటే..

రోహిత్ శ‌ర్మ ఏమ‌న్నాడంటే..

‘‘మేము మొదట బ్యాటింగ్ చేయబోతున్నాం. పిచ్ పొడిగా కనిపిస్తోంది. వీలైనన్నీ ఎక్కువ ప‌రుగులు చేయడం ముఖ్యం. అక్షర్ పటేల్ ఫిట్‌గా ఉన్నాడు. దీంతో అతను జ‌ట్టులోకి తిరిగి వచ్చాడు. అక్ష‌ర్ ప‌టేల్‌.. జయంత్ స్థానంలో ఆడుతున్నాడు. ఇది పరిస్థితులతో చాలా సంబంధం కలిగి ఉంది. ఇది పొడి పిచ్. అక్షర్ ప‌టేల్ తాను ఆడిన చివరి సిరీస్‌లో ఏమి చేసాడో చూశాము. కాబట్టి మేము అతన్ని తిరిగి జ‌ట్టులోకి తీసుకున్నాం. కేవలం ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన తర్వాత జయంత్‌ను త‌ప్పించాల్సి రావ‌డం దురదృష్టకరం. కానీ మేము మ‌ళ్లీ త‌ర్వాత‌ బాగా ఆడిన కుర్రాళ్లకు తమను తాము నిరూపించుకోవడానికి తగినన్ని అవకాశాలు ఇస్తాం. ఇది సవాలుతో కూడిన టెస్ట్ మ్యాచ్ కానుంది. మేము ఈ ఆట నుంచి మనం కోరుకున్నది సాధించాలి.'' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ తెలిపాడు.

 దిముత్ కరుణరత్నే ఏమ‌న్నాడంటే..

దిముత్ కరుణరత్నే ఏమ‌న్నాడంటే..

‘‘పిచ్ చాలా పొడిగా ఉంది. తరువాతి భాగంలో అది మార‌బోతుంది. కాబట్టి మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము. మేము చివరి టెస్టులో చేసిన తప్పుల గురించి మాట్లాడాల‌నుకోవ‌డం లేదు. కానీ ఆ త‌ప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలనుకుంటున్నాము. ప్రతి సెషన్‌లో టీమిండియాతో పోటీ పడాలి. మ్యాచ్‌ ఎలా సాగుతుందో చూద్దాం. మేము గతంలో మంచి పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్‌లను ఆడాము. అది ఆటగాళ్లకు సహాయం చేస్తుంది. పాతుమ్ నిస్సాంక, లహిరు కుమార ఈ మ్యాచ్‌కు అందుబాటులో లేరు. వారి స్థానంలో కుశాల్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ జ‌ట్టులోకి వ‌చ్చారు.'' అని శ్రీ‌లంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే తెలిపాడు.

IND VS SL Pink Ball Test: Ravindra Jadeja Fitness Update జడేజా మిస్ అయితే ఎవరు | Oneindia Telugu
తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

శ్రీలంక: దిముత్ కరుణరత్నె(కెప్టెన్‌), లహిరు తిరిమన్నె, కుసల్ మెండిస్, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, చరిత్ అసలంక, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీప‌ర్), సురంగ లక్మల్, లసిత్ ఎంబుల్దెనియా, విశ్వ ఫెర్నాండో, ప్రవీణ్ జయవిక్రమ.

భారత్: మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్‌), హనుమ విహారి, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.

Story first published: Saturday, March 12, 2022, 15:04 [IST]
Other articles published on Mar 12, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+