Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka:టాస్ గెలిచిన ఇండియా.. జట్టులో నో ఛేంజేస్.. లంక టీంలో కీలక మార్పులు

India vs Sri Lanka: India won the toss and elected to bowl in the second T20 match

ధ‌ర్మ‌శాల‌: శ్రీ‌లంక‌తో రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భార‌త్ మొద‌ట బౌలింగ్ చేయనుంది. అలాగే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా ఫ‌స్ట్ టీ20 మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతుంది. ఇక ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌లో 1-0 తో అధిక్యంలో ఉన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌లో గెలిచి మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే సిరీస్ కైవ‌సం చేసుకోవాల‌ని భావిస్తోంది.

రోహిత్ ఏమ‌న్నాడంటే..

''మేము ముందుగా బౌలింగ్ చేయబోతున్నాము, మా ముందు ఒక స్కోరు ఉండాలని కోరుకుంటున్నాము. ఆట సాగుతున్న కొద్దీ వాతావ‌ర‌ణం చల్లగా మారుతుంది. మా జ‌ట్టులో ఎలాంటి మార్పులు లేవు. తొలి టీ20 మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే బ‌రిలోకి దిగుతున్నాం. జ‌ట్టులో మార్పులు అనేవి గెలుపు, ఓటములపై ఆధారపడి ఉండవు. మార్పులు జట్టు అవ‌స‌రాల‌ను బ‌ట్టే ఉంటాయి. జ‌ట్టులో ఎంపిక‌లో మేము గాయాలను కూడా పరిశీలిస్తాము. ఆట‌గాళ్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాం'' అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అన్నాడు.

శ్రీ‌లంక కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

శ్రీ‌లంక కెప్టెన్ ఏమ‌న్నాడంటే..

''పిచ్ కవర్‌ల‌తో క‌ప్పి ఉన్నందున మేము కూడా టాస్ గెలిస్తే బౌలింగే చేయాల‌నుకున్నాం. మా ఓపెనర్లు, టాప్ ఆర్డర్ రాణింంచాల్సిన‌ అవసరం ఉంది. ఈ మ్యాచ్‌లో మేము రెండు మార్పులతో బ‌రిలోకి దిగుతున్నాం. జనిత్ లియానాగే, జెఫ్రీ వాండర్సే ఈ మ్యాచ్ ఆడ‌డం లేదు. వారి స్థానంలో బినూర ఫెర్నాండో, దనుష్క గుణతిలక జట్టులోకి వ‌చ్చారు.'' అని శ్రీ‌లంక కెప్టెన్ ధ‌సున్ శ‌న‌క తెలిపాడు.

 తుది జ‌ట్లు

తుది జ‌ట్లు

శ్రీలంక:

పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, దినేష్ చండిమాల్ (వికెట్ కీప‌ర్), దసున్ షనక (కెప్టెన్‌), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రవీణ్ జయవిక్రమ, బినుర ఫెర్నాండో, లహిరు కుమార

 భారత్:

భారత్:

రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్ కీప‌ర్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్.

Story first published: Saturday, February 26, 2022, 18:55 [IST]
Other articles published on Feb 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+