
అరంగేట్రం అప్పుడే
2007లో తొలిసారి భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహిత్ శర్మ ప్రస్తుతం టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. దాదాపు ఈ పదహారేళ్ల కెరీర్లో హిట్‌మ్యాన్ అనేక రికార్డులను అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ తన తొలి మ్యాచ్‌ను జూన్ 23న ఐర్లాండ్‌తో ఆడాడు. ఇది వన్డే మ్యాచ్. అదే ఏడాది టీ20ల్లోకి కూడా హిట్‌మ్యాన్ అరంగేట్రం చేశాడు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్‌తో రోహిత్ శర్మ తొలి టీ20 మ్యాచ్ ఆడాడు. అయితే టెస్టుల్లో మాత్రం ఆరేళ్ల తర్వాత 2013లో నవంబర్ 6న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌తో అరంగేట్రం చేశాడు.

ఏ ఫార్మాట్లో ఎన్ని మ్యాచ్‌లు
దాదాపు 16 ఏళ్ల క్రికెట్‌లో కెరీర్లో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ ఇప్పటివరకు 399 మ్యాచ్‌లు ఆడాడు. ఈ నెల 12 నుంచి శ్రీలంకతో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ అన్ని ఫార్మాట్లలో కలిపి హిట్‌మ్యాన్‌కు 400వది కావడం విశేషం. ఇప్పటివరకు టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ 44 మ్యాచ్‌లు, వన్డే క్రికెట్‌లో 230 మ్యాచ్‌లు, టీ20 క్రికెట్‌లో 125 మ్యాచ్‌లు ఆడాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ 41 సెంచరీలు, 84 హాఫ్ సెంచరీలు చేశాడు. 4 సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 264 పరుగులు. మొత్తంగా 15,672 పరుగులు సాధించాడు.

ఫార్మాట్ల వారీగా రికార్డులు
కెరీర్లో ఇప్పటివరకు 44 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 46 సగటుతో 3,076 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఓ సారి డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకున్నాడు. అత్యధిక స్కోర్ 212 పరుగులు కావడం గమనార్హం. ఇక వన్డే ఫార్మాట్లో 230 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 48 సగటుతో 9,283 పరుగులు చేశాడు. ఇందులో 29 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మూడు సార్లు డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకోగా అత్యధిక స్కోర్ 264 పరుగులు గమనార్హం.

అత్యధిక టీ20 మ్యాచ్‌లు
ఇక 125 టీ20 మ్యాచ్‌ల్లో 32 సగటుతో 3,313 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 118 పరుగులు కావడం గమనార్హం. కాగా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు, అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా రోహిత్ శర్మ పేరు మీదనే ఉండడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్లలో టీమిండియాను కెప్టెన్‌గా విజయవంతంగా నడిపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications












