Ind vs SL: రికార్డు ఆల్‌రౌండర్ షోతో జడేజా అదుర్స్.. వందో టెస్టులో కోహ్లీకి మరిచిపోలేని విజయం

మొహాలీ: టీమిండియా వెటరన్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి భారత జట్టు అదిరిపోయే కానుక ఇచ్చింది. కోహ్లీ వందో టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్‌సేన విరాట్‌కు మరిచిలేని విజయాన్ని ఇచ్చింది. రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో తొలి టెస్టులో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా ఘనవిజయం సాధించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ సైతం తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే అదిరిపోయే విజయాన్ని అందుకున్నాడు. ఇక మూడో రోజు శ్రీలంక రెండు సార్లు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాగా ఈ టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లోనే ముగియడం గమనార్హం. దీంతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0తో అధిక్యంలోకి వెళ్లింది.

రవీంద్ర జడేజా రికార్డు ఆల్‌రౌండ్ షో
విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదిరిపోయే ఫర్‌ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటర్‌గా కెరీర్ బెస్ట్ ఫర్‌ఫామెన్స్ ఇచ్చిన రవీంద్ర జడేజా 175 పరుగులతో అజేయంగా నలిచాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. దీంతో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 175 పరుగుల భారీ స్కోర్ సాధించడంతోపాటు 9 వికెట్లు తీసిన ఆటగాడిగా రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా 574/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. భారత బ్యాటర్లలో రవీంద్ర జడేజా 175*, రిషబ్ పంత్ 96, రవిచంద్రన్ అశ్విన్ 61, హనుమ విహారీ 58 పరుగులతో రాణించారు. మిగతావారిలో విరాట్ కోహ్లీ 45, మయాంక్ అగర్వాల్ 33, రోహిత్ శర్మ 29, శ్రేయస్ అయ్యర్ 27, షమీ 20* పరుగులు చేశారు. లంక బౌలర్లలో లక్మల్, ఎంబుల్దేనియా, ఫెర్నాండో రెండేసి వికెట్లు తీశారు. కుమార, డిసిల్వా తలో వికెట్ తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో కుప్ప కూలిన లంక
108/4 ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక 65 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక ఇన్నింగ్స్‌లో పాతుమ్ నిస్సంక(133 బంతుల్లో 11 ఫోర్లతో 61 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. చివరి నలుగురు బ్యాట్స్‌మన్ అయితే డకౌటవ్వడం విశేషం. జడేజా ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. షమీకి ఓ వికెట్ దక్కింది.

రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత్ హవా
400 పరుగుల భారీ లోటుతో ఫాలో ఆన్ ఆరంభించిన శ్రీలంక బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లోనూ చేతులెత్తేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లోనూ భారత హవా కొనసాగింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ బాల్‌తో రెండో ఇన్నింగ్స్‌లోను చెలరేగారు. దీంతో శ్రీలంక 178 పరుగులకే ఆలౌటైంది. లంక బ్యాటర్లలో డిక్వెల్లా 51*, డిసిల్వా 30, మాథ్యుస్ 28, కరుణరత్నే 27, చరిత్ అసలంక 20, నిసాంక 6, ఎంబుల్దేనియా 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, అశ్విన్ 4, షమీ 2 వికెట్లు తీశారు. కాగా ఇరు జట్లు మధ్య రెండో ఈ నెల 12 నుంచి బెంగళూరు వేదికగా డే అండ్ నైట్‌గా జరగనుంది.
సంక్షిప్తి స్కోర్లు:
భారత్: 574-8 డిక్లేర్
శ్రీలంక: 174 ఆలౌట్, 178 ఆలౌట్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications