IND vs SL: ఇషాన్ కిషన్ సూపర్ బ్యాటింగ్.. ఆల్‌రౌండ్ షోతో భారత్ అదుర్స్.. లంకేయులపై జయభేరి

లక్నో: తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత ఆటగాళ్లు అదిరే ఆట తీరుతో చెలరేగారు. మొదట భారీ స్కోర్ సాధించిన టీమిండియా ఆ తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లంకేయులు ఏ దశలోనూ లక్ష్యాన్ని చేధించేలా కనిపించలేదు. దీంతో ఏకపక్షంగా సాగిన పోరులో శ్రీలంకపై టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత బ్యాటర్లలో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా... బౌలర్లలో భువనేశ్వర్ ఆరంభంలోనే 2 వికెట్లతో సత్తా చాటాడు. శ్రీలంక బ్యాటర్లలో చరిత్ అసలంక అజేయ హాఫ్ సెంచరీ చేసినప్పటికీ, నిదానంగా ఆడడంతో ఆ జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. ఈ విజయంతో టీమిండియా టీ20ల్లో వరుసగా పదో విజయాన్ని నమోదు చేసింది.
చెలరేగిన భువి
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకను టీమిండియా సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆరంభంలోనే దెబ్బకొట్టాడు. 15 పరుగులకే లంక ఓపెనర్లను ఫెమిలియన్ పంపాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే పాతుమ్ నిస్సాంకను డకౌట్ చేసిన భువి.. ఆ తర్వాతి ఓవర్‌లో 13 పరుగులు చేసిన కమిల్ మిషారాను కూడా ఔట్ చేశాడు. ఆ తర్వాత 11 పరుగులు చేసిన జనిత్ లియానగేను వెంకటేశ్ అయ్యర్, 10 పరుగులు చేసిన వికెట్ కీపర్ దినేష్ చండీమాల్‌ను రవీంద్ర జడేజా, 3 పరుగులు చేసిన కెప్టెన్ దసన్ షనకను చాహల్ ఔట్ చేశారు. దీంతో 11 ఓవర్లలో శ్రీలంక 60 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
భారీగా పెరిగిన రన్‌రేట్
ఈ క్రమంలో లంకను చరిత్ అసలంక ఆదుకున్నాడు. ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్న అసలంక ఒంటరి పోరాటం చేశాడు. 97 పరుగుల వద్ద 21 పరుగులు చేసిన చామిక కరుణరత్నేను ఆరో వికెట్‌గా వెంకటేశ్ అయ్యర్ ఫెమిలియన్ పంపాడు. అనంతరం చరిత్ అసలంక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఇన్నింగ్స్ స్లోగా సాగడంతో శ్రీలంక చేధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లు వచ్చేసరికి లక్ష్యాన్ని శ్రీలంక చేధించలేని విధంగా తయారయింది. చివరకు టీమిండియా 62 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. అసలంక 47 బంతుల్లో 53 పరుగులు, దుశాంత చమీర 24 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వీరిద్దరు చివరి వికెట్‌గా అజేయంగా 40 పరుగులు చేసిన ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ విజయంతో టీమిండియా 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 తో అధిక్యంలోకి వెళ్లింది.
స్కోర్లు: భారత్: 199-2
శ్రీలంక: 137-6
భారత్ భారీ స్కోర్
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లో ఇషాన్ కిషన్ 89, శ్రేయస్ అయ్యర్ 56* పరుగులతో చెలరేగారు. రోహిత్ శర్మ 44 పరుగులతో రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications