కోహ్లీకి స్పెషల్ మెమెంటో
ప్రారంభానికి ముందు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టు సభ్యులు అందరితో కలిసి వందో టెస్టు మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి 100వ టెస్ట్ క్యాప్‌తో కూడిన స్పెషల్ మెమెంటోను అందించాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీతోపాటు అతని సతీమణి అనుష్క శర్మ కూడా ఉంది. అలాగే కోహ్లీ సోదరుడు, ఇతర కుటుంబంలో స్టేడియంలో ఉన్నారు.

కోహ్లీపై ప్రశంసలు
100వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి క్యాప్‌తో కూడిన స్పెషల్ మెమెంటో అందించిన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అతనిపై ప్రశంసలు కురిపించాడు. ఈ స్పెషల్ మెమెంటోకు కోహ్లీ అర్హుడని, ఇది అతను సంపాదించుకున్నదని చెప్పుకొచ్చాడు. రాబోయే అనేక విషయాలకు ఇది ప్రారంభం మాత్రమే అని తెలిపాడు. డ్రెస్సింగ్ రూంలో చెప్పినట్లు దానిని రెట్టింపు చేయాలని కోరాడు.

గర్వంగా ఉంది
"ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. నా భార్య ఇక్కడ ఉంది. నా సోదరుడు కూడా ఉన్నాడు. అందరూ చాలా గర్వంగా ఉన్నారు. జట్టు సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. బీసీసీఐకి కూడా ధన్యవాదాలు. నేటి తరం క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు. అయితే నా చిన్ననాటి హీరో రాహుల్ ద్రావిడ్ చేతుల మీదుగా 100వ టెస్ట్ మ్యాచ్ క్యాప్ అందుకోవడం గర్వంగా ఉంది." అని విరాట్ కోహ్లీచెప్పాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తెలుగు కుర్రాడు హనుమ విహారీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత జట్టు ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు సీమర్లతో బరిలోకి దిగుతుంది.

తుది జట్లు
శ్రీలంక: దిముత్ కరుణరత్నే(కెప్టెన్), లహిరు తిరిమన్నె, పాతుమ్ నిస్సంక, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్వెల్లా(వికెట్ కీపర్), సురంగ లక్మల్, విశ్వ ఫెర్నాండో, లసిత్ ఎంబుల్దెనియా, లహిరు కుమార.
భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, హనుమ విహారి, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా.


Click it and Unblock the Notifications












