Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భజ్జీకి ఏమైంది?: ఆ ట్వీట్ ఎందుకు తొలగించాడు

India vs Sri Lanka: Harbhajan Singh Mocks Visitors, Then Deletes Tweet

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ శ్రీలంక క్రికెట్ జట్టుని ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్ పెను దుమారనే సృష్టించింది. నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడటంతో చివరకు తలొగ్గిన హర్భజన్ చివరకు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశాడు.

అసలేం జరిగింది?
జింబాబ్వేతో జరిగిన సిరీస్‌లో శ్రీలంక ఘోరంగా ఓటమిపాలైందని, తొలి ఇన్నింగ్స్‌లో 200, రెండో ఇన్నింగ్స్‌లో 150 పరుగులు చేసిందని ట్వీట్ చేశాడు. తన కెరియర్‌లోనే అట్టడుగు స్థాయికి శ్రీలంక పడిపోయిందని... జట్టును ఇలా చూడటం చాలా బాధాకరంగా ఉందని అందులో పేర్కొన్నాడు.

అంతేకాదు త్వరలోనే వారు కోలుకుంటారని, మళ్లీ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటారనే ఆశాభావాన్ని ట్వీట్‌లో భజ్జీ వ్యక్తం చేశాడు. భజ్జీ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీలంక జట్టుకు చెందిన కొందరు ఆటగాళ్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో చేసేదేమీ లేక తన ట్వీట్‌ను భజ్జీ డిలీట్ చేశాడు. ఇదిలా ఉంటే మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు భారత్ పర్యటనకు వచ్చింది. ఇరు జట్ల మధ్య నవంబర్ 16 (గురువారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది.

Story first published: Monday, November 13, 2017, 13:49 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+