IND vs SL 3rd T20I:భారత్-శ్రీలంక చివరి టీ20 నేడే.. డ్రీమ్ 11 ప్రిడిక్షన్స్, కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!!

కొలంబో: బుధవారం రాత్రి చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో శ్రీలంక నాలుగు వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమం చేసింది. గురువారం ఇరు జట్ల మధ్య సిరీస్ విజేతను నిర్ణయించే మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ గెలిచిన ధావన్ సేన.. పొట్టి సిరీస్ కూడా పట్టాలని చూస్తోంది. మరోవైపు పటిష్ట లంక మూడో మ్యాచ్ గెలవాలని ఇవ్విల్లూరూతోంది. కొలంబోలోని ప్రేమదాస మైదానంలో ఈ రోజు మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సోనీ స్పోర్ట్ ఇండియాలో మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది.

సైనీకి గాయం:
కరోనా కారణంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా సిరీస్ మొత్తానికి దూరం అయ్యాడు. అతడికి సన్నిహితంగా ఉన్న పృథ్వీ షా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, యుజ్వేంద్ర చహల్, మనీశ్ పాండేలు రెండో టీ20కి దూరమవడంతో భారత్ చాలా మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోవడంతో దేవ్‌దత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, చేతన్ సకారియా, నితీష్ రాణా టీ20 అరంగేట్రం చేశారు. బెంచ్ బౌలర్లు కూడా జట్టులోకి వచ్చారు. మూడో టీ20లో కూడా భారత్ దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగనుంది. రెండో టీ20లో గాయపడ్డ నవదీప్ సైనీ ఆడడంపై కాస్త అనుమానాలు నెలకొన్నాయి.

పటిష్టంగా శ్రీలంక:
ప్రస్తుతం టీమిండియాతో పోలిస్తే.. శ్రీలంక పటిష్టంగా ఉంది. అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక, సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనకలతో బ్యాటింగ్ విభాగం పటిష్టంగా ఉంది. ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయతో బౌలింగ్ కూడా బాగుంది. మూడో టీ20కి లంక ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. రెండో టీ20లో బరిలోకి దిగిన జట్టే చివరి మ్యాచ్ ఆడనుంది.

తుది జట్లు (అంచనా):
భారత్: శిఖర్ ధావన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , దేవదత్ పడిక్కల్, సంజూ శాంసన్ (కీపర్), నితీశ్ రాణా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చహర్, నవ్‌దీప్ సైనీ, వరుణ్ చక్రవర్తి, చేతన్ సకారియా.
శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, మినోద్ భానుక (కీపర్), సదీరా సమర విక్రమా, దనుంజయ డిసిల్వా, రమేశ్ మెండీస్, డసన్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, వానిందు హసరంగ, ఇసురు ఉడానా, దుష్మంత చమీరా, అకిలా ధనుంజయ.

భారత్-శ్రీలంక డ్రీమ్ 11 టీమ్:
శిఖర్ ధావన్, మినోద్ భానుక (కీపర్), ధనంజయ డిసిల్వా, వానిందు హసరంగ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ (వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, చమిక కరుణరత్నే, అవిష్క ఫెర్నాండో, దేవదత్ పడిక్కల్, రాహుల్ చహర్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications