Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: వరుసగా రెండు శతకాలు.. కొలంబో టెస్టులోనూ ధనాధన్ సెంచరీ!

IND vs SL: కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గతేడాది నుంచి లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్న దేవదత్ పడిక్కల్.. ఈ మ్యాచ్‌లో తన అత్యుత్తమ ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా రెండో శతకాన్ని నమోదు చేశాడు. తొలి టెస్టులో 167 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచిన దేవదత్ పడిక్కల్.. ఈ మ్యాచ్‌లోనూ ఆరంభం నుంచే ఎంతో కంట్రోల్‌తో బ్యాటింగ్ చేశాడు.

IND vs SL: ఔట్ కాకుండానే పెవిలియన్‌కు రిషబ్ పంత్.. అసలేం జరిగింది?

IND vs SL: ఔట్ కాకుండానే పెవిలియన్‌కు రిషబ్ పంత్.. అసలేం జరిగింది?

గిల్‌తో కలిసి కీలక భాగస్వామ్యం
ఈ ఇన్నింగ్స్‌లో దేవదత్ పడిక్కల్ చూపించిన ఓర్పు, సంయమనం అందరినీ ఆకట్టుకున్నాయి. అనవసరమైన షాట్లకు పోకుండా వికెట్ కాపాడుకుంటూ 168 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన సెంచరీలో ఒక్క సిక్స్ కూడా కొట్టకుండా కేవలం 10 ఫోర్లతో మైదానమంతా క్లాసిక్ షాట్లు బాదాడు. ముఖ్యంగా టీమిండియా 66 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కొంచెం ఒత్తిడి నెలకొన్న సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్ కు 120 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకున్నాడు.

India vs Sri Lanka Devdutt Padikkal Scores Second Consecutive Test Century in Colombo Full Details Here

నంబర్-3 సమస్యకు సమాధానం చెప్పిన పడిక్కల్!
ఛతేశ్వర్ పుజారా రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ జట్టులో మూడో స్థానంలో ఆడే సరైన బ్యాటర్ కోసం టీమిండియా యాజమాన్యం కొంతకాలంగా చూస్తోంది. పేస్, స్పిన్ బౌలింగ్ రెండింటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ వరుసగా రెండు శతకాలు బాదిన దేవదత్ పడిక్కల్ ఆ సమస్యకు దాదాపు ముగింపు పలికాడు. శ్రీలంక స్పిన్నర్లను స్వీప్, డ్రైవ్‌లతో సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరు మూడో స్థానంలో అతడి స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది.

IND vs PAK : భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఎప్పుడంటే?

Also Read

IND vs PAK : భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్.. ఎప్పుడంటే?

పోటీలోని ఆటగాళ్లకు తప్పని ఇబ్బందులు
దేవదత్ పడిక్కల్ నిలకడైన ప్రదర్శనతో మూడో స్థానం కోసం పోటీపడుతున్న ఇతర ఆటగాళ్లకు దారులు కష్టంగా మారాయి. ప్రధానంగా సాయి సుదర్శన్ కు పడిక్కల్ ఫామ్ పెద్ద సవాలుగా నిలిచింది. సాయి సుదర్శన్ గాయపడటంతోనే దేవదత్ పడిక్కల్ కు తుది జట్టులో అవకాశం లభించగా.. వచ్చిన అవకాశాన్ని దేవదత్ పడిక్కల్ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. దీంతో రాబోయే టెస్ట్ సిరీస్ లలో సాయి సుదర్శన్ తిరిగి జట్టులోకి రావడం అంత సులువు కాదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Story first published: Sunday, August 23, 2026, 17:19 [IST]
Other articles published on Aug 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+