Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: డే అండ్ నైట్ టెస్టుల్లో భార‌త్ సత్తా ఎంత‌? మొత్తం పింక్ బాల్ టెస్టుల రికార్డులు ఇదిగో!

India vs Sri Lanka: Day And Night Test Total Records.. Most Runs, Most Wickets and Most Centuries

బెంగ‌ళూరు: భార‌త్, శ్రీ‌లంక మ‌ధ్య ఈ నెల 12 నుంచి బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. అటు తొలి టెస్ట్ మ్యాచ్‌లో దారుణ ప‌రాభావం పాలైన శ్రీ‌లంక రెండో టెస్ట్‌లో పుంజుకోవాల‌ని భావిస్తోంది. అయితే ఇది పింక్ బాల్ టెస్టు మ్యాచ్ కావ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు టెస్ట్ క్రికెట్‌లో జ‌రిగిన‌ డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌ల వివ‌రాలు, రికార్డులు ఎలా ఉన్నాయ‌నే వివ‌రాలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి.

ఎన్ని మ్యాచ్‌లంటే..

ఎన్ని మ్యాచ్‌లంటే..

టెస్టు క్రికెట్‌లో తొలి అండ్ నైట్ మ్యాచ్ 2015 న‌వంబ‌ర్ 27న జ‌రిగింది. ఆస్ట్రేలియాలోని ఆడిలైడ్ వేదిక‌గా జ‌రిగిన‌ ఆ మ్యాచ్‌లో ఆసీస్, న్యూజిలాండ్ త‌ల‌ప‌డ్డాయి. ఆ మ్యాచ్‌లో కంగారుల‌నే విజ‌యం వ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు 18 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌గా.. అన్నింట్టో ఫ‌లితం తేల‌డం గ‌మ‌నార్హం.

డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌లో తొలి వికెట్ తీసిన రికార్డు ఆస్ట్రేలియా బౌల‌ర్ జోష్ హేజిల్‌వుడ్ పేరు మీద ఉంది. న్యూజిలాండ్ ఓపెన‌ర్ మార్టిన్ గుప్తిల్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అత‌ను ఈ రికార్డును అందుకున్నాడు.

అత్యంత విజ‌యవంత‌మైన జ‌ట్టుగా ఆసీస్

అత్యంత విజ‌యవంత‌మైన జ‌ట్టుగా ఆసీస్

డే అండ్ నైట్ టెస్టుల్లో అత్యంత విజ‌యవంత‌మైన జ‌ట్టుగా ఆస్ట్రేలియా పేరు గాంచింది. ఆ జ‌ట్టు ఇప్ప‌టివ‌ర‌కు 10 పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడ‌గా అన్నింట్లో విజ‌యం సాధించింది. పింక్‌బాల్ టెస్టులో సెంచ‌రీ చేసిన తొలి ఆట‌గాడిగా పాకిస్థాన్ బ్యాట‌ర్ అజహర్ అలీ నిలిచాడు. దుబాయ్ వేదిక‌గా వెస్టిండీస్‌తో జ‌రిగిన టెస్టు మ్యాచ్‌లో అజ‌ర్ అలీ ట్రిపుల్ సెంచ‌రీ (302) సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన 18 డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌ల్లో 23 సెంచ‌రీలు నమోద‌య్యాయి.

రెండు ట్రిపుల్ సెంచ‌రీలు

రెండు ట్రిపుల్ సెంచ‌రీలు

ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన డే అండ్ నైట్ టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచ‌రీలు న‌మోద‌య్యాయి. 2016లో వెస్టిండీస్‌పై అజ‌ర్ అలీ (302), 2019లో పాకిస్థాన్‌పై డేవిడ్ వార్న‌ర్ (335) ట్రిపుల్ సెంచ‌రీలు సాధించారు. డే అండ్ టెస్టుల్లో అత్య‌ధిక స్కోర్ 589/3. పాకిస్థాన్‌పై ఆస్ట్రేలియా సాధించింది. ఇక అత్య‌ల్ప స్కోర్ 36-9. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌లో ఈ రికార్డు ఇండియా పేరు మీద‌నే న‌మోదైంది.

అత్య‌ధిక ర‌న్స్‌, వికెట్లు

అత్య‌ధిక ర‌న్స్‌, వికెట్లు

అత్యుత్త‌మ బౌలింగ గ‌ణాంకాలు 8/49. ఇవి వెస్టిండీస్‌కు చెందిన దేవేంద్ర బిషూ పేరు మీద ఉన్నాయి. 596 ప‌రుగులతో డే అండ్ నైట్ టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా డేవిడ్ వార్న‌ర్ ఉన్నాడు. అత్య‌ధిక వ్య‌క్తి గత స్కోర్ కూడా డేవిడ్ వార్న‌ర్ (335) పేరు మీద‌నే ఉంది. 6 టెస్టుల్లో 57 స‌గ‌టుతో వార్న‌ర్ ఈ గ‌ణాంకాల‌ను సాధించాడు. ఇక అత్య‌ధిక వికెట్ల రికార్డు కూడా ఆస్ట్రేలియాకు చెందిన మిచెల్ స్టార్క్ పేరు మీద ఉంది. 8 టెస్టుల్లో అత‌ను 46 వికెట్లు తీశాడు. ఇందులో 3 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు.

భార‌త్ రికార్డులు

భార‌త్ రికార్డులు

ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా 3 డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 2 గెలిచి, ఒక‌టి ఓడిపోయింది. ఇంగ్లండ్‌, బంగ్లాదేశ్‌పై విజ‌యాలు సాధించ‌గా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. డే అండ్ నైట్ టెస్టులో సెంచ‌రీ చేసిన ఏకైక‌ భార‌త‌ ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ 136 ప‌రుగులు చేశాడు. అటు ప్ర‌స్తుతం టీమిండియాతో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ ఆడ‌బోచే శ్రీ‌లంక కూడా ఇప్ప‌టివ‌ర‌కు 3 పింక్ బాల్ టెస్టులు ఆడి రెండు గెలిచి, ఒక‌టి ఓడింది.

Story first published: Thursday, March 10, 2022, 16:42 [IST]
Other articles published on Mar 10, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+