IND vs SL: పటిష్ట పాకిస్తాన్‌ను భారత్​-బీ జట్టు కచ్చితంగా ఓడిస్తుంది: పాక్ మాజీ క్రికెటర్

కరాచీ: శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుపై పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రధాన కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ నేతృత్వంలో యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని కొనియాడారు. ప్రస్తుత పటిష్ట పాకిస్థాన్​ జట్టును లంక పర్యటనలో ఉన్న ధావన్ సేన కచ్చితంగా ఓడించగలదని కనేరియా అభిప్రాయపడ్డాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టెస్ట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉండగా.. మరోవైపు శిఖర్ ధావన్ సారథ్యంలోని మరో జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. భారత్ ఒకేసారి ఇలా రెండు దేశాల్లో ఆడడం ఇదే తొలిసారి.

రెండు వన్డేల్లో అద్భుత విజయాలు:

రెండు వన్డేల్లో అద్భుత విజయాలు:

లంక పర్యటనలో భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, యుజ్వేంద్ర చహల్‌, హార్దిక్‌ పాండ్యా లాంటి సీనియర్లతో పాటు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), దేశవాళీ టోర్నీలలో సత్తాచాటాటిన పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, రుతురాజ్‌ గైక్వాడ్‌, దేవదత్‌ పడిక్కల్‌, కృష్ణప్ప గౌతమ్, చేతన్ సకారియా లాంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. సిరీస్ ఆరంభానికి ముందు ధావన్ కెప్టెన్సీలోని జట్టుని భారత-బీ జట్టుగా లంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభివర్ణించాడు. రణతుంగ వ్యాఖ్యలను ధావన్ సేన తిప్పికోట్టింది. రెండు వన్డేల్లో అద్భుత విజయాలు అందుకుని తాము భారత-బీ టీమ్ కాదని నిరూపించింది.

Tokyo Olympics 2021: పోలండ్ జట్టుకు భారీ షాక్.. ఆరుగురు స్విమ్మర్లు ఔట్!!

పాకిస్తాన్‌ను ఓడించగలదు:

పాకిస్తాన్‌ను ఓడించగలదు:

తాజాగా డానిష్ కనేరియా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'కోచ్​ రాహుల్​ ద్రవిడ్​ నేతృత్వంలో లంక పర్యటనలో ఉన్న భారత జట్టు అద్భుతాలు చేస్తోంది. టీమిండియా ప్రదర్శనతో పాటు.. రాహుల్​ ద్రవిడ్ భారత జట్టుతో కలిసి పనిచేసిన ​ విధానాన్ని ప్రశంసించకుండా ఉండలేము. ద్రవిడ్​.. కుల్దీప్ యాదవ్‌‌​ను ప్రేరేపించిన విధానం కూడా బాగుంది. భారత్​-బీ టీమ్​గా పిలుస్తున్న ఈ జట్టు ప్రస్తుత పాకిస్థాన్​ క్రికెట్​ జట్టును కచ్చితంగా ఓడించగలదు' అని ధీమా వ్యక్తం చేశాడు. 2000లో పాక్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కనేరియా.. 61 టెస్టులు, 18 వన్డేలు ఆడి 276 వికెట్లు తీశాడు. పాకిస్థాన్ క్రికెట్‌‌లో కనేరియా ఓ బెస్ట్ స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఎలాంటి కారణం లేకుండానే పీసీబీ కనేరియాను జట్టు నుంచి తప్పించింది.

Ind Vs SL : Five Debutants For Teamindia.. ఇది రెండోసారి మాత్రమే | Oneindia Telugu
ఫైనల్‌లో భారత్-వెస్టిండీస్:

ఫైనల్‌లో భారత్-వెస్టిండీస్:

టీ20 ప్రపంచకప్​ కంటే ముందు ఇండియన్​ ప్రీమియర్​ లీగ్ ​(ఐపీఎల్​)లో పాల్గొనడం భారత క్రికెటర్లకు కలిసొచ్చే అంశమని డానిష్​ కనేరియా పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా అక్టోబరులో జరగనున్న ఈ మెగా​ ఫైనల్​లో వెస్టిండీస్​, భారత్​ జట్లు పోటీ అవకాశం ఉందని జోస్యం చెప్పాడు. 'టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్ ఎక్కువగా అంతర్జాతీయ టీ20లు ఆడదు. అయితే ఐపీఎల్ 2021 మ్యాచులు ఉండడం వారికి కలిసొచ్చే అంశం. ఫైనల్‌లో భారత్-వెస్టిండీస్ తలపడే అవకాశం ఉంది' అని కనేరియా చెప్పాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా ప్రస్తుతం వన్డే సిరీస్​ ఆడుతున్న భారత్.. జులై 25 నుంచి టీ20 సిరీస్ ఆడనుంది. పొట్టి ఫార్మాట్​ సిరీస్​లో భాగంగా ఆడబోయే మూడు మ్యాచ్​ల ద్వారా రాబోయే టీ20 ప్రపంచకప్​ జట్టు ఎంపిక జరిగే అవకాశం ఉంది.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Friday, July 23, 2021, 19:47 [IST]
Other articles published on Jul 23, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X