Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SL: రోహిత్ మా కెప్టెన్ కాదు.. కోహ్లీని మ‌ళ్లీ కెప్టెన్‌ను చేయండి.. ఫ్ల‌కార్డుల‌తో చిన్నారుల కోరిక‌

India vs Sri Lanka: Children display placards demanding Virat Kohli to be made captain again

విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల‌ కెప్టెన్సీకి దూర‌మై చాలా కాలం అవుతుంది. అయిన‌ప్ప‌టికీ కోహ్లీ కెప్టెన్సీపై ఇంకా అక్క‌డ‌క్క‌డ చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. తాజాగా శ్రీ‌లంక‌తో జ‌ర‌గుతున్న పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో ఈ విష‌యం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని తెర‌పైకి తెచ్చింది ఈ సారి ఇద్ద‌రు చిన్నారులు కావ‌డం గ‌మ‌నార్హం. మ్యాచ్ జ‌ర‌గుతుండ‌గా ఇద్ద‌రు చిన్నారులు ఓ ఫ్ల‌కార్డును ప్ర‌ద‌ర్శించారు. ''ఇందులో రోహిత్ శ‌ర్మ‌ నా కెప్టెన్‌ కాదు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌టైమ్ విరాట్‌ కోహ్లిని తిరిగి కెప్టెన్‌గా నియమించండి'' అని రాసి ఉంది. ఆ ఫోటోను ఆ చిన్నారుల తండ్రి సోష‌ల్ మీడియాలో పోస్ట్ ప్ర‌స్తుతం అది నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై అభిమానులు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ అభిమానులైతే త‌మ కోరిక కూడా అదే అంటూ రాసుకొస్తున్నారు.

కెప్టెన్‌గా టీమిండియాను విరాట్ కోహ్లీ అద్భుతంగా న‌డిపించాడు. అత‌న నాయ‌క‌త్వంలో టీమిండియాకు ఎన్నో విజ‌యాలు సాధించాడు. టెస్టు క్రికెట్లో అత్య‌ధిక విజ‌యాలు అందించిన నాయ‌కుడిగా నిలిచాడు. ఈ క్ర‌మంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా 42 నెల‌ల‌పాటు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానంలో కొన‌సాగింది. అలాగే కోహ్లీ కెప్టెన్సీలో స్వ‌దేశంలో టీమిండియా ఒక్క టెస్టు సిరీస్ కూడా ఓడిపోలేదు. అయితే 2021 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ స‌మ‌యంలో టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు విరాట్ కోహ్లీ ప్ర‌క‌టించాడు. అదే స‌మ‌యంలో ఐపీఎల్‌లో కూడా ఇక నుంచి రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కెప్టెన్‌గా ఉండ‌బోన‌ని వెల్ల‌డించాడు.

IND vs SL : Rohit Sharma Huge Six Injures Spectator Nose | Oneindia Telugu

అయితే టీ20 కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న‌ప్ప‌టికీ వ‌న్డే, టెస్టు కెప్టెన్‌గా ఉండాల‌ని విరాట్ కోహ్లీ భావించాడు. కానీ అలా జ‌ర‌గ‌లేదు. బీసీసీఐ వ‌న్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని త‌ప్పించింది. దీంతో ఆ స‌మ‌యంలో విరాట్ కోహ్లీకి, బీసీసీఐకి మ‌ధ్య మాట‌ల యుద్ధ‌మే నెల‌కొంది. అనంత‌రం జ‌రిగిన సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. దీంతో విరాట్ కోహ్లీనే స్వయంగా టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో టీమిండియాకు అన్ని ఫార్మాట్ల‌లో కెప్టెన్‌గా బీసీసీఐ రోహిత్ శ‌ర్మ‌ను నియ‌మించింది.

Story first published: Monday, March 14, 2022, 17:11 [IST]
Other articles published on Mar 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+