Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

2017లో ఒకే ఒక్కడు: నాగ్‌పూర్ టెస్టులో పుజారా అరుదైన ఘనత

India vs Sri Lanka: Cheteshwar Pujara first Indian to breach 1000-run mark in Tests in 2017

హైదరాబాద్: నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు ఛటేశ్వర్ పుజారా మరో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాది భారత్ నుంచి ఈ ఘనత సాధించి ఒక్కే ఒక్కడు పూజారా.

ఇప్పటివరకు ఈ ఏడాది కేవలం ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే టెస్టుల్లో 1000 పరుగులు నమోదు చేశారు. అందులో ఒకరు దక్షిణాఫ్రికాకు చెందిన దేనా ఎల్గర్ కాగా, రెండో ఆటగాడు శ్రీలంకకు చెందిన కరుణరత్నే. కరుణరత్నే ఈ ఘనతను ఇదే టెస్టులో తొలిరోజు నమోదు చేయడం విశేషం.

ఎల్గర్ 20 ఇన్నింగ్స్‌ల్లో 1097 పరుగులు చేయగా, కరుణరత్నే 23 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు నమోదు చేయడం విశేషం. కాగా, 1000 పరుగులు సాధించేందుకు పుజారాకు 16 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఈ ముగ్గురిలో పుజారా 71.14 యావరేజితో మెరుగ్గా ఉన్నాడు.

ఈ ఏడాది పుజారా అద్భుతమైన ఫామ్‌లో కొనసాగుతుండటం విశేషం. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఏకైక టెస్టులో పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 83, రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరిస్‌లో కూడా అద్భుత ప్రదర్శన చేశాడు.

కాగా, రెండో తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 80 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఓవర్ నైట్ స్కోరు 11/1తో రెండో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన పుజారా, మురళీ విజయ్‌ల జోడీ అద్భుతమైన ప్రదర్శన చేసింది. వీరిద్దరూ నిలకడగా ఆడి భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని అందించారు.

అయితే 76వ ఓవర్‌లో వీరిద్దరి జోడీని లంక బౌలర్లు విడదీశారు. ఇన్నింగ్స్ 76వ ఓవర్ మూడో బంతిని లెగ్ స్టంప్ మీదుగా స్వీప్ చేసేందుకు ప్రయత్నించిన మురళీ విజయ్ క్యాచ్ ఔట్ అయ్యాడు.

పుజారా హాఫ్ సెంచరీ
నాగ్‌పూర్‌ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత బ్యాట్స్‌మన్‌ పుజారా హాఫ్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 145 బంతులాడిన పుజారా 7 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో పుజారాకి ఇది 17వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, November 25, 2017, 15:52 [IST]
Other articles published on Nov 25, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+