Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రహానే విఫలం: మద్దతుగా పుజారా, కోహ్లీపై ప్రశంసలు

India Vs Sri Lanka: Cheteshwar Pujara backs struggling Ajinkya Rahane

హైదరాబాద్: స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బందులు పడుతున్న టీమిండియా వైస్ కెప్టెన్ అజ్యింకె రహానేకు జట్టులోని సహచర ఆటగాడు ఛటేశ్వర్ పుజారా మద్దతుగా నిలిచాడు. 'రహానే క్లాస్ ప్లేయర్. ప్రస్తుతం అతడు పరుగుల సాధించడంలో విఫలం అవుతున్నాడని, త్వరలోనే తిరిగి ఫామ్‌ను అందిపుచ్చుకుంటాడు' అని రెండు టెస్ట్‌లో సెంచరీ అనంతరం పుజారా పేర్కొన్నాడు.

'రహానే క్రికెట్ పట్ల నిబద్ధతను కలిగి ఉన్నాడని, అతడు తప్పుకుండా భారీ స్కోర్లు చేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. త్వరలోనే అతడు జట్టులో కీలక ఆటగాడు అవుతాడు' అని పుజారా తెలిపాడు. మరోవైపు కోహ్లీలా వేగంగా ఇతర బ్యాట్స్‌మన్‌ పరుగులు ఎందుకు చేయలేకపోతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు పుజారా తనదైన శైలిలో స్పందించాడు.

కోహ్లీలా ఇతరులు ఆడటం అంత ఈజీ కాదని పుజారా స్పష్టం చేశాడు. కెరీర్ ఆరంభంలోనే కోహ్లీ అన్ని ఫార్మాట్లలో రాణించాడని... ఇతర క్రికెటర్లు ఎవరూ ఆ స్థాయిలో రాణించలేదని చెప్పాడు. అంతులేని ఆత్మవిశ్వాసమే కోహ్లీ విజయానికి కారణమని తెలిపాడు. గత మూడేళ్ల నుంచి కోహ్లి కొనసాగించిన స్ట్రైక్‌ రేట్‌ను ఇతర ఆటగాళ్లు కొనసాగించడం చాల కష్టమని అన్నాడు.

మరోవైపు బ్యాటింగ్‌కు ఏమాత్రం అనుకూలించిన ఈ పిచ్‌పై అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ భారీ స్కోరు చేశామని పుజారా తెలిపాడు. గత రెండేళ్లుగా ఫిట్‌నెస్‌పై దృష్టి సారించానని పుజారా తెలిపాడు. ఫిట్‌నెస్ కారణంగానే తాను గంటల సేపు క్రీజులో ఉండగలుగుతున్నానని చెప్పాడు.

ముఖ్యంగా కౌంటీ క్రికెట్, గత అనుభవాలు తనకు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపాడు. విదేశాల్లో రాణించాలన్న తపనతోనే బ్యాటింగ్ నైపుణ్యాన్ని పెంచుకున్నానని... దక్షిణాఫ్రికా పర్యటనలో రాణిస్తానని పుజారా ఆశాభావం వ్యక్తం చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 27, 2017, 14:53 [IST]
Other articles published on Nov 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+