Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రెండో టెస్టుకి భువీ, ధావన్ దూరం: జట్టులోకి విజయ్‌శంకర్

India Vs Sri Lanka: Bhuvneshwar, Shikhar opt out; rookie all-rounder Vijay Shankar inducted

హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ప్రారంభం కానున్న రెండో టెస్టుకు పేసర్ భువనేశ్వర్ కుమార్, బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ దూరమయ్యారు. వ్యక్తిగత కారణాల రీత్యా వీరిద్దరూ నాగ్‌పూర్ టెస్టుకు దూరం అవుతున్నారని బీసీసీఐ ప్రకటించింది.

శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో అద్భుత ప్రదర్శన చేసిన భువనేశ్వర్ కుమార్ నవంబర్ 23న తన ప్రేయసి నుపుర్‌ను పెళ్లాడబోతున్నాడు. దీంతో లంకతో జరిగే చివరి రెండు టెస్టులకు అతడు దూరం అయ్యాడు. దీంతో భువనేశ్వర్ స్థానంలో తమిళనాడు ఆల్‌రౌండర్‌ విజయ్ శంకర్‌కు సెలక్టర్లు చోటు కల్పించారు.

కానీ రెండో టెస్టులో విజయ్ శంకర్ ఆడే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. భువీ స్థానాన్ని ఇషాంత్ శర్మతో భర్తీ చేసే అవకాశం ఉంది. మరోవైపు వ్యక్తిగత కారణాలతో ఓపెనర్‌ ధావన్‌ రెండో టెస్టుకు దూరం కానున్నాడు. అయితే ధావన్ మాత్రం మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడు.

భువీ, ధావన్ ఇద్దరూ వ్యక్తిగత కారణాల రీత్యా రెండో టెస్టు ఆడలేమని రిక్వెస్ట్ చేశారు. దీంతో వారిని రిలీజ్ చేశామని బీసీసీఐ ట్వీట్ చేసింది. తమిళనాడు వన్డే కెప్టెన్ అయిన విజయ్ శంకర్ 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 1671 పరుగులు చేసి, 27 వికెట్లు తీశాడు. ఇండియా-ఏ తరఫున ఆడుతున్నాడు. శ్రీలంకతో ఈనెల 24న నాగ్‌పూర్‌లో మొదలయ్యే రెండో టెస్ట్‌కు బీసీసీఐ సోమవారం 14 మందితో జట్టును ప్రకటించింది.

రెండో టెస్టుకు భారత జట్టు:
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,సాహా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, అజింక్య రహానే, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, విజయ్ శంకర్

Story first published: Tuesday, November 21, 2017, 13:10 [IST]
Other articles published on Nov 21, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+