
హైదరాబాద్ : మొహాలీ వేదికగా జరిగిన శ్రీలంక వన్డే మ్యాచ్ బుధవారం జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ఘోర పరాజయం ఎదురైంది. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టులో ప్రధాన పాత్ర పోషించాడు ఏంజిలొ మాథ్యూస్. జట్టు స్కోరు 251 కాగా అందులో మాథ్యూస్ ఒక్కడే 111పరుగులు చేశాడు.
ఇప్పుడు ఆ జట్టుకు మళ్లీ మాథ్యూస్ ఒక్కడే దిక్కు అన్నట్లు కనిపిస్తుంది. కానీ, తన ఆరోగ్యం పెద్దగా సహకరించట్లేదు. బుధవారం మ్యాచ్ తర్వాతి నుంచి తను క్రాంప్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆదివారం అంటే డిసెంబరు 17న జరగనున్న మ్యాచ్‌కు అతను అందుబాటులో ఉంటేనే ఆ టీం దశ మారగలిగేది.
డిసెంబరు 15 శుక్రవారం మైదానంలో ఫుల్ టైం ప్రాక్టీస్‌లో పాల్గొననున్నాడు. ఆదివారం జరిగాల్సిన మ్యాచ్ లో పాల్గొంటాడు అనే అంశంపై మాకు సందేహాలున్నాయి. అని ఆ జట్టు ప్రధాన కోచ్ అయిన ఛండికా హతురుసింఘ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు అందుబాటులో లేకపోతే డిసెంబరు 20న జరిగే టీ20మ్యాచ్ లకు హాజరవుతాడని కోచ్ వివరించాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.