Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Sri Lanka: దారుణంగా విరాట్ కోహ్లీ ఫామ్‌.. ఐదేళ్ల త‌ర్వాత 50 దిగువ‌కు ప‌డిపోయిన సగ‌టు

India vs Sri Lanka: After Five years Virat Kohlis average falls below 50 in Test format
Virat Kohli's Test Average Dropped Below 50 As Tribute To RCB | Bangalore Stadium | Oneindia Telugu

బెంగ‌ళూరు: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫాం దారుణంగా త‌యారైంది. ఇన్నాళ్లు సెంచ‌రీలు చేయ‌క‌పోయిన క‌నీసం హాఫ్ సెంచ‌రీలైన చేస్తున్నాడ‌ని అభిమానులు కాస్త భ‌రోసాతో ఉన్నారు. త్వ‌ర‌లోనే సెంచ‌రీ కొట్టి మ‌ళ్లీ పాత ఫామ్‌కు అందుకుంటాడ‌ని ఆశించారు. కానీ తాజాగా శ్రీ‌లంక‌తో సిరీస్‌లోనూ విరాట్ కోహ్లీ విఫ‌ల‌మ‌వ‌డంతో ఈసారి అత‌ని కెరీర్ స‌గ‌టుపై కూడా ప్ర‌భావం చూపించింది. టెస్టు కెరీర్లో కోహ్లీ స‌గ‌టు ఏకంగా 50కి దిగువ‌కు ప‌డిపోయింది. దీంతో ఇన్నాళ్లు 3 ఫార్మాట్ల‌లో 50కి పైగా స‌గ‌టుతో ఉన్న కోహ్లీ ప్ర‌స్తుతం ఆ ఘ‌న‌త‌కు దూర‌మ‌య్యాడు.

50కి దిగువ‌గా కోహ్లీ స‌గ‌టు

50కి దిగువ‌గా కోహ్లీ స‌గ‌టు

శ్రీ‌లంక‌తో రెండో టెస్టులో విఫ‌ల‌మ‌వ‌డంతో విరాట్ టెస్టు కెరీర్ స‌గ‌టు 50కి దిగువ‌గా ప‌డిపోయింది. కోహ్లీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23, సెకండ్ ఇన్నింగ్స్‌లో 13 ప‌రుగులు చేశాడు. ఈ టెస్టులో కోహ్లీ 43 ప‌రుగులు చేసి ఉంటే అత‌ని స‌గ‌టు 50కి పైనే ఉండేది. కానీ కోహ్లీ 36 ప‌రుగులే చేయ‌డంతో టెస్టు క్రికెట్‌లో ఐదేళ్ల త‌ర్వాత అత‌ని స‌గ‌టు 50 లోప‌లికి ప‌డిపోయింది.

ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్ స‌గ‌టు 49.96గా ఉంది. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ సగటు 50 నుంచి 49.55కి దిగజారింది. తాజాగా అదే శ్రీ‌లంక‌తో కోహ్లీ స‌గ‌టు మ‌ళ్లీ 49కి దిగ‌జారింది. కాగా ఇప్ప‌టివ‌ర‌కు 101 టెస్టు మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 49.96 స‌గ‌టుతో 8043 ప‌రుగులు చేశాడు. ఇక టీమిండియా మ‌ళ్లీ జూలై వ‌ర‌కు టెస్టు మ్యాచ్‌లు ఆడే అవ‌కాశం లేక‌పోవ‌డంతో అప్ప‌టివ‌ర‌కు కోహ్లీ స‌గ‌టు 49గానే ఉండ‌నుంది.

వ‌న్డే, టీ20ల్లో మాత్రం

వ‌న్డే, టీ20ల్లో మాత్రం

టెస్టు క్రికెట్లో స‌గ‌టు 49కి ప‌డిపోయిన‌ప్ప‌టికీ వ‌న్డే, టీ20ల్లో మాత్రం కోహ్లీ స‌గ‌టు 50కి పైగానే ఉంది. వ‌న్డేల్లో కోహ్లీ స‌గ‌టు 58గా, టీ20ల్లో 51గా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు 260 వ‌న్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్ కోహ్లీ 51 స‌గ‌టుతో 12311 ప‌రుగులు చేశాడు. ఇందులో 43 సెంచ‌రీలు, 64 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అలాగే 97 టీ20 మ్యాచ్‌లు ఆడి 51 స‌గ‌టుతో 3296 ప‌రుగులు చేశాడు. ఇందులో 30 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా అంత‌ర్జాతీయ క్రికెట్లో కోహ్లీ చివ‌రి సారిగా 2019 న‌వంబ‌ర్‌లో సెంచ‌రీ సాధించాడు.

విజ‌యం దిశ‌గా భార‌త్‌

విజ‌యం దిశ‌గా భార‌త్‌

ఇక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజ‌యం దిశ‌గా ప‌య‌నిస్తోంది. బ్యాట్‌, బాల్‌తో అద‌ర‌గొట్టిన రోహిత్ సేన రెండో రోజు కూడా పూర్తి అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టానికి 28 ప‌రుగులు చేసిన శ్రీ‌లంక విజ‌యానికి 419 ప‌రుగులు దూరంలో ఉంది. క్రీజులో కెప్టెన్ క‌రుణ‌ర‌త్నే (10), కుశాల్ మెండీస్ (16) ఉన్నారు. జ‌స్ప్రీత్ బుమ్రా తొలి ఓవ‌ర్లోనే తిరిమాణేను ఎల్బీగా డ‌కౌట్ చేశాడు. ల‌క్ష్యం భారీగా ఉండ‌డంతో ఈ మ్యాచ్‌లో ఇండియా విజ‌యం ఖాయ‌మైంద‌నే చెప్పుకోవాలి.

Story first published: Monday, March 14, 2022, 8:04 [IST]
Other articles published on Mar 14, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+