
హైదరాబాద్: మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక పోరాడుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక 9 వికెట్లకు 356 పరుగులు చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులు వెనుకబడే ఉంది. శ్రీలంక ఆటగాళ్లు మూడోరోజు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు.
కెప్టెన్ చండీమాల్ (147 నాటౌట్), మాజీ కెప్టెన్ మాథ్యూస్ (111) సెంచరీలతో మెరిశారు. మూడో రోజు కూడా పిచ్ బ్యాటింగ్‌కే అనుకూలించడంతో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. దీంతో తొలి రెండు సెషన్లలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశారు. 3 వికెట్లకు 131 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన శ్రీలంక అద్భుత పోరాటం చేసింది.
చండీమాల్, మాజీ కెప్టెన్ మాథ్యూస్‌లు నిలకడగా ఆడుతూ వీరిద్దరూ నాలుగో వికెట్‌కు ఏకంగా 181 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు చేశారు. టెస్టుల్లో మాథ్యూస్ 8వ సెంచరీని నమోదు చేయగా, చండీమాల్‌కు 10వ సెంచరీని నమోదు చేశాడు.
రెండో సెషన్ చివర్లో అశ్విన్ ఎట్టకేలకు వీరి భాగస్వామ్యానికి తెరదించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమతో కలిసి ఐదో వికెట్‌కు చండీమాల్ 61 పరుగులు జోడించాడు. సమరవిక్రమను ఇషాంత్ ఔట్ చేయడంతో శ్రీలంక ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అశ్విన్ మూడు, షమి, ఇషాంత్, జడేజా తలా రెండు వికెట్లు తీసుకున్నారు.

వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన లంక
ఫిరోజ్ షా కోట్లో వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఓవర్ల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న సమరవిక్రమ(36) పరుగులు వద్ద ఇషాంత్ వేసిన ఇన్నింగ్స్ 117వ ఓవర్ నాలుగో బంతికి కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రోహన్ సెల్వ పరుగులు చేయకుండా ఔట్ అయ్యాడు.
అశ్విన్ వేసిన 118 ఓవర్ నాలుగో బంతిని సెల్వ డిఫెండ్ చేసిందుకు ప్రయత్నించగా.. అది కాస్త బ్యాట్‌కి తగిలి షార్ట్ లెగ్‌లో ఫీల్డింగ్‌లో ఉన్న ధావన్ చేతిలోకి వెళ్లింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన డిక్వాల్లా 120వ ఓవర్లో అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో శ్రీలంక వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజ్‌లో చండిమాల్(121), డిక్‌వెలా(1) పరుగులతో ఉన్నారు.
టెస్టుల్లో పదో సెంచరీ చేసిన లంక కెప్టెన్ చండీమాల్
ఫిరోజ్ షా కోట్లో వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ సెంచరీ చేశాడు. 104వ ఓవర్లో అశ్విన్ వేసిన తొలి బంతికి సింగిల్ రన్ తీసిన చండీమాల్ 100 పరుగులు పూర్తి చేశాడు. టెస్టుల్లో చండీమాల్‌కు ఇది పదో సెంచరీ. ఈ ఏడాది మూడో సెంచరీ కావడం విశేషం.
ప్రస్తుతం 105 ఓవర్లు ముగిసే సమయానికి లంక 4 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో చండీమాల్ 100, సమరవిక్రమ 16 ఉన్నారు. గాయం కారణంగా మాథ్యూస్ ఔటైన తర్వాత సమరవిక్రమ బ్యాటింగ్‌కు దిగాడు. శనివారం తొలి రోజు ఆటలో సమరవిక్రమ తలకు గాయమైన సంగతి తెలిసిందే.
టీ విరామానికి శ్రీలంక 270/4
ఫిరోజ్ షా కోట్లో వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. క్రీజులో పాతుకు పోయిన ఏంజెలో మాథ్యూస్ (111)ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన మాయాజాలంతో పెవిలియన్ పంపాడు. దీంతో నాలుగో వికెట్‌కు 181 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది.
మరోవైపు లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ (98) సెంచరీకి చేరువయ్యాడు. మాథ్యూస్ అనంతరం క్రీజులోకి వచ్చిన సమరవిక్రమ (4) పరుగులతో క్రీజులో ఉన్నాడు. 102 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 270 పరుగులు చేసింది.
నాలుగో వికెట్ కోసం నాలుగు గంటలు
శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగో వికెట్ కోసం భారత్ నాలుగు గంటల నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది. ఆటలో మూడో రోజైన సోమవారం ఉదయం నుంచి పేసర్లు, స్పిన్నర్లను మార్చిమార్చి బౌలింగ్ వేయిస్తున్నా వికెట్లు తీయడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతానికి 90 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది.
ఏంజెలో మాథ్యూస్ (108), దినేశ్ చండిమాల్ (81) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 429 బంతుల్లో 167 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. మాథ్యూస్ 98 పరుగుల వద్ద రోహిత్‌శర్మ క్యాచ్ వదిలేయడంతో లైఫ్ లభించింది.

హైదరాబాద్: ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ సెంచరీని నమోదు చేశాడు. 231 బంతులను ఎదుర్కొన్న మాథ్యూస్ 12 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 100 పరుగులు చేశాడు. టెస్టుల్లో మాథ్యూస్‌కి ఇది 8వ సెంచరీ కాగా, ఇండియాపై మూడోది కావడం విశేషం.
అయితే, ఫామ్‌లో లేని మాథ్యూస్ చాన్నాళ్ల తర్వాత సెంచరీ సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో మాథ్యూస్‌కి రెండుసార్లు లైఫ్ లభించడం విశేషం. ఈ రెండు లైఫ్‌లు ఇషాంత్ బౌలింగ్‌లోనే లభించాయి. ఆరు పరుగుల వద్ద కోహ్లీ, 98 వద్ద రోహిత్‌శర్మ స్లిప్‌లో క్యాచ్‌లు వదిలేశారు.
ప్రస్తుతం 82 ఓవర్లకు గాను శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మాథ్యూస్ (101), దినేశ్ చండీమాల్ (61) పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

లంచ్ విరామానికి లంక 192/3
ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్ విరామానికి 71 ఓవర్లకు గాను శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. ప్రస్తుతం ఏంజెలో మాథ్యూస్ (90) పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు.
మరో ఎండ్‌లో కెప్టెన్ దినేశ్ చండీమాల్ (52) పరుగులతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
మూడో రోజు ప్రారంభమైన మ్యాచ్:
ఫిరోజ్‌షా కోట్లా వేదికగా భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో మూడో రోజైన సోమవారం శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించింది. ఓవర్‌నైట్ స్కోరు 131/3తో దినేశ్ చండిమాల్ (32) బ్యాటింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం 60 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో దినేశ్ చండిమాల్ (39), ఏంజెలో మాథ్యూస్ (72) పరుగులతో ఉన్నారు. అంతకముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 536/7 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ 243 పరుగులతో డబుల్ సెంచరీ చేయగా, మురళీ విజయ్ సెంచరీని నమోదు చేశాడు.