న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3rd T20I: శార్దుల్ ఠాకూర్ మెరుపులు , శ్రీలంక విజయ లక్ష్యం 202

India vs Sri Lanka, 3rd T20I: Shardul lifts India to 201 after Dhawan, Rahul fifties

హైదరాబాద్: పూణె వేదికగా జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంకకు టీమిండియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఫలితంగా శ్రీలంకకు 202 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.

భారత జట్టులో శిఖర్ ధావన్(52), కేఎల్ రాహుల్(54), సంజు శాంసన్ (6),మనీష్ పాండే(31 నాటౌట్ ) , శ్రేయాస్ అయ్యర్(4), విరాట్ కోహ్లీ(26), శార్దుల్ ఠాకూర్ (22 నాటౌట్ ) లు ఫరవాలేదనిపించారు.
ఇక, శ్రీలంక బౌలర్లలో వనిందు హసరంగా 1, లాహిరు కమార 1, లక్ష్సన్ సందకన్ 3 వికెట్లు పడగొట్టారు.

1
46129

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక
అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ లసిత్ మలింగ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగింది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ స్థానంలో సంజూ శాంసన్‌కు చోటు దక్కగా... తుది జట్టులో చోటు కోసం కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న మనీశ్‌ పాండేతో పాటు కుల్దీప్ స్థానంలో చాహల్‌కు చోటు దక్కింది.

మూడో టీ20లో గనుక టీమిండియా విజయం సాధిస్తే శ్రీలంకపై తన రికార్డుని కూడా మరింతగా మెరుగుపరచుకుంటుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తర్వాత శ్రీలంకపై ద్వైపాక్షికి సిరిస్‌లో ఇప్పటివరకు టీమిండియా ఓడిపోలేదు. ఇరు జట్ల మధ్య 6 టీ20ల సిరిస్‌లు జరగ్గా అందులో టీమిండియా 5 సిరిస్ విజయాలను సొంతం చేసుకుంది.

ఒక సిరిస్ డ్రాగా ముగిసింది. ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా విజయం సాధించడంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో చివరిదైన మూడో టీ20లో సైతం విజయం సాధించి 2-0తో కైవసం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన ఆరంభం ఇవ్వాలని చూస్తోంది.

Story first published: Friday, January 10, 2020, 21:00 [IST]
Other articles published on Jan 10, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X