For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు మూడో టీ20.. సిరీస్‌పై భారత్ గురి.. ఒత్తిడిలో శ్రీలంక

India vs Sri Lanka 3rd T20I preview: team news, possible XI and betting odds

పుణె: కొత్త ఏడాదిని సిరీస్‌ విజయంతో ఆరంభించేందుకు భారత్ సిద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం చివరిదైన మూడో టీ20 పుణెలో జరగనుంది. శ్రీలంకతో జరిగే చివరి టీ20లోనూ గెలిచి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకోవాలని భారత్ తహతహలాడుతోంది. తద్వారా 2020కి ఘనమైన విజయారంభం ఇవ్వాలని చూస్తోంది. గత విజయం ఇచ్చిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగుతుంటే.. ప్రత్యర్థి శ్రీలంక మాత్రం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది.

ఒత్తిడంతా ధావన్‌పైనే:

ఒత్తిడంతా ధావన్‌పైనే:

ఓపెనింగ్‌లో శిఖర్‌ ధావన్ ఇండోర్‌లో ఏమంతగా ఆకట్టుకోలేదు. బ్యాటింగ్‌ ట్రాక్‌పై కూడా 29 బంతుల్లో 32 పరుగులు చేసి వెనుదిరిగాడు. రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఈ సిరీస్‌ ఆడుకుంటున్న ధావన్.. అతడు జట్టులోకి వస్తే మాత్రం తుది జట్టుకు దూరం కావాల్సిందే. మరోవైపు కేఎల్ రాహుల్‌ మాత్రం బౌండరీలతో చెలరేగి రోహిత్‌తో జత కట్టేందుకు దూసుకెళుతున్నాడు. రాహుల్‌ మ్యాచ్‌ మ్యాచ్‌కు మెరుగవుతున్నాడు. రెగ్యులర్‌ ఓపెనర్‌గా పాతుకుపోయినట్లే. అందుకే పుణెలో ధావన్ తను మునుపటి ఫామ్‌ను ప్రదర్శించకుంటే రాబోయే సిరీస్‌లో రెండో ఓపెనర్‌ అవకాశం కోల్పోయినట్టే.

దుర్బేధ్యంగా భారత బ్యాటింగ్‌:

దుర్బేధ్యంగా భారత బ్యాటింగ్‌:

విరాట్ కొహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, శివమ్ దూబేలతో భారత బ్యాటింగ్‌ దుర్బేధ్యంగా ఉంది. గత కొన్ని సిరీస్‌లుగా బెంచ్‌కే పరిమితమవుతూ వస్తున్న మనీశ్ పాండే, సంజూ శాంసన్‌కు మరోసారి నిరాశ తప్పకపోవచ్చు. అయితే జట్టులో మార్పులు చేస్తే ఒకరికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది.

బుమ్రా లయ అందుకునేనా:

బుమ్రా లయ అందుకునేనా:

సీనియర్‌ పేసర్లు మొహమ్మద్ షమీ, భువనేశ్వర్‌ కుమార్ గైర్హాజరీలో ఆకట్టుకున్న శార్దూల్‌ ఠాకూర్‌, నవ్‌దీప్‌ సైనీ అదే జోరు కొనసాగించాలని మేనేజ్‌మెంట్‌ ఆశిస్తోంది. పునరాగమనంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన స్పీడ్‌స్టర్‌ జస్ప్రీత్‌ బుమ్రా.. ఇండోర్‌లో తన స్థాయి ప్రదర్శన చేయలేదు. నాలుగుల నెలల విరామం తన లయను దెబ్బతీయలేదంటున్న బుమ్రా.. పుణెలో ఏం చేస్తాడో ఆసక్తికరంగా మారింది. కుల్దీప్‌, సుందర్‌ జట్టులో కొనసాగే అవకాశాలున్నాయి.

 ఇండోర్‌లో టీమిండియాకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన మలింగ సేన..

ఇండోర్‌లో టీమిండియాకు ఏమాత్రం పోటీనివ్వలేకపోయిన మలింగ సేన..

ఆఖరి పోరులోనైనా ఆకట్ట్టుకోవాలని చూస్తోంది. మాజీ కెప్టెన్‌ ఏంజెలో మాథ్యూస్‌ బరిలో దిగనుండటం లంకకు కొండంత బలం. ఉడాన గాయపడటంతో అతడి స్థానంలో మాథ్యూస్‌ జట్టులోకి రానున్నాడు. అవిష్క ఫెర్నాండో, గుణతిలక, ఒషాడా ఫెర్నాండో, రాజపక్సలపైనే బ్యాటింగ్ భారం ఉంది. టీమిండియాకు పోటీనివ్వాలంటే లంక శక్తికి మించి పోరాడాల్సిన అవసరం ఉంది.

పిచ్, వాతావరణం:

పిచ్, వాతావరణం:

పుణె వికెట్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు పేసర్లకు కూడా సహకరించవచ్చు. వరుణుడి నుంచి ఎలాంటి ముప్పు లేదు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌ బౌలర్లకు కాస్త ఇబ్బంది తప్పదు.

జట్లు (అంచనా):

జట్లు (అంచనా):

భారత్‌: కోహ్లీ (కెప్టెన్‌), ధావన్, రాహుల్, శ్రేయస్, రిషభ్‌ పంత్, శివమ్‌ దూబే, జడేజా, వాషింగ్టన్‌ సుందర్, కుల్దీప్‌, శార్దుల్, బుమ్రా.

శ్రీలంక: మలింగ (కెప్టెన్‌), గుణతిలక, అవిష్క ఫెర్నాండో, కుశాల్‌ పెరీరా, రాజపక్స, ఒషాడా ఫెర్నాండో, మాథ్యూస్, షనక, ధనంజయ, హసరంగ, లహిరు కుమార.

Story first published: Friday, January 10, 2020, 8:55 [IST]
Other articles published on Jan 10, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+