For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరిసిన ధావన్.. శ్రీలంకపై భారత్ ఘన విజయం.. సిరీస్‌ కైవసం!!

India Vs Srilanka 3rd T20I: India Won Match By 78 Runs, Shardul Thakur Grabs Man Of The Match Award!
India vs Sri Lanka 3rd T20I: Navdeep Saini, Shikhar Dhawan, KL Rahul guide IND to series win

పుణె: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) స్టేడియం వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. శ్రీలంకను 15.5 ఓవర్లలో 123 పరుగులకే కట్టడి చేసిన భారత్‌.. వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫలితంగా సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండో టీ20లో భారత్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శార్దూల్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కగా.. సిరీస్‌లో అద్భత ప్రదర్శన చేసిన నవ్‌దీప్ సైనీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది.

తొలి ఓవర్‌‌లోనే షాక్:

తొలి ఓవర్‌‌లోనే షాక్:

202 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన లంకకు బుమ్రా తొలి ఓవర్‌‌లోనే షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌‌ చివరి బంతికి ఓపెనర్ గుణతిలక (1) వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి అవిష్క పెర్నాండో (9) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఒషాడా ఫెర్నాండో (2)ను మనీశ్ పాండే రనౌట్ చేశాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడింది.

ఆదుకున్న మ్యాథ్యూస్:

ఆదుకున్న మ్యాథ్యూస్:

నవ్‌దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి కుషల్ పెరీరా (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే కష్టాల్లోపడ్డ జట్టును ఎంజిలో మ్యాథ్యూస్, ధనుంజయ డి సెల్వ ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్‌లో మ్యాథ్యూస్ (31) పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన దాసున్ శనక (9), వానిండు హసరంగా (0), లక్షన్ సందకన్ (1) త్వరగానే పెవిలియన్ చేరారు.

ధనుంజయ పోరాటం:

ధనుంజయ పోరాటం:

వికెట్లు పడుతున్నా ధనుంజయ మాత్రం పట్టువదలలేదు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సులతో 57 పరుగులు చేసాడు. కానీ.. నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మలింగా (0) సైనీ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులు చేసి ఆలౌట్ అయింది. నవ్‌దీప్ సైనీ 3.. శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్ చెరో 2, బుమ్రా 1 వికెట్ తీశారు.

ధావన్‌, రాహుల్ హాఫ్ సెంచరీలు:

ధావన్‌, రాహుల్ హాఫ్ సెంచరీలు:

ముందుగా బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (52), కేఎల్‌ రాహుల్‌ (54)లు శుభారంభాన్ని ఇస్తే.. మనీష్‌ పాండే (31 నాటౌట్‌; 18 బంతుల్లో 4 ఫోర్లు), శార్దూల్‌ ఠాకూర్‌ (22 నాటౌట్‌;8 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్లు) చెలరేగారు. సుదీర్ఘ విరామం తర్వాత రెండో టీ20 ఆడుతున్న సంజూ సామ్సన్‌ (6) నిరాశపరిచాడు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (26;17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) ధాటిగా ఆడాడు.

Story first published: Saturday, January 11, 2020, 7:03 [IST]
Other articles published on Jan 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+