శ్రీలంక పర్యటనలో భారత్ టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో సాధించింది. ఇక మిగిలిన ఆఖరి టీ20 మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నామమాత్రపు పోరుకు పల్లెకెలె వేదికగా కానుంది. టీ20 సిరీస్‌లో ఆఖరి పంచ్ కూడా అదిరేలా సత్తాచాటాలని టీమిండియా భావిస్తోంది.
అయితే రెండో టీ20కి అంతరాయం కలిగించిన వరుణుడు ఆఖరి మ్యాచ్‌లోనూ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మంగళవారం సాయంత్రం జల్లులు కురిసే అవకాశం ఉంది. కాస్త ఆలస్యమైనా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువ.
కాగా, ఈ ఆఖరి పోరులో బెంచ్ సామర్థ్యాన్ని పరీక్షించుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ తుదిజట్టులోకి రానున్నారు.

మెడనొప్పితో రెండో టీ20కు దూరమైన శుభ్‌మన్ గిల్ ఆఖరి టీ20కి అందుబాటులోకి రానున్నాడు. రిషబ్ పంత్ స్థానంలో శాంసన్ జట్టులో కొనసాగే అవకాశం ఉంది. మరోవైపు ఆతిథ్య జట్టు శ్రీలంక ఈ మ్యాచ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. భారత్‌కు క్లీన్ స్వీప్ ఛాన్స్ ఇవ్వకూడదని, పరువు నిలుపుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. భారత్ జట్టులో కొత్త దశలానే శ్రీలంక నూతన జట్టును నిర్మిస్తుంది. అయితే మిడిలార్డర్ సమస్య వాళ్లను తీవ్రంగా కలచివేస్తోంది. ఇవాళ మ్యాచ్‌లో ఆ సమస్యకు చెక్ పెట్టాలని భావిస్తుంది. గతేడాది నుంచి శ్రీలంక 5-7 స్థానాల్లో 11 బ్యాటర్లను ప్రయత్నించింది.
భారత తుది జట్టు(అంచనా)
శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), సంజు శాంసన్/రిషభ్ పంత్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్య/శివమ్ దూబె, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
శ్రీలంక తుది జట్టు (అంచనా)
కుశాల్ మెండిస్, నిస్సాంక, కుశాల్ పెరీరా, దినేశ్ చండిమాల్/అవిష్క ఫెర్నాండో, చరిత అసలంక, వానిందు హసరంగ, తీక్షణ, రమేశ్ మెండిస్/దిల్షాన్ మధుశంక, పతిరనా, అసిత ఫెర్మాండో.
సోనీ నెటవర్క్‌లో లైవ్
టీమిండియా విదేశీ సిరీస్‌లకు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సోనీ స్పోర్ట్స్ టెన్ 3(హిందీ), సోనీ స్పోర్ట్స్ టెన్ 4(తమిళం/తెలుగు), సోనీ స్పోర్ట్స్ టెన్ 5 ఛానెల్‌లో ఈ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సోనీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ యాప్‌లో కూడా ఈ మ్యాచ్‌లు రానున్నాయి.
రుసుము చెల్లించకుండా ఫ్రీగా చూడాలంటే?
ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనిలివ్ యాప్‌లో చూడాలంటే సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి. కానీ మొబైల్స్‌లో ఫ్రీగా చూడాలనుకుంటే జియోటీవీ యాప్ నుంచి చూడవచ్చు. ఈ యాప్‌లో ఛానెల్స్‌లో... సోనీ టీవీ నెట్ వర్క్ ఛానెల్స్‌ను ఎంపిక చేసుకోని భారత్ వర్సెస్ శ్రీలంక సిరీస్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని ఉచితంగా చూడవచ్చు. దీనికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.