టీ20ల్లో అత్యధిక వికెట్లు: పూణె టీ20లో అశ్విన్ రికార్డు బద్దలు కొట్టి బుమ్రా

హైదరాబాద్: పూణె వేదికగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా బుమ్రా (53) అగ్రస్థానంలో నిలిచాడు.
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో శుక్రవారం లంకతో జరిగిన మూడో టీ20లో ఆ జట్టు ఓపెనర్ ధనుష్క గుణతిలను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఈ మైలురాయని అందుకున్నాడు. భారత్ తరుపున 45 మ్యాచ్‌ల్లో బుమ్రా(53) ఈ ఘనత సాధించాడు.
ఇక, ఈ జాబితాలో బుమ్రా తర్వాత స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ (52) సంయుక్తంగా రెండోస్థానంలో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరిస్‌లో బుమ్రా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో 1/32 గణాంకాలను నమోదు చేసిన బుమ్రా, మూడో టీ20లో 1/5 గణాంకాలను నమోదు చేశాడు. ఫలితంగా ఆఖరి టీమిండియా 78 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసి మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో కైవసం చేసుకుంది.

వర్షం కారణంగా తొలి టీ20 రద్దు
తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండో టీ20లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. శార్దూల్‌కి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కగా.. సిరీస్‌లో అద్భత ప్రదర్శన చేసిన నవ్‌దీప్ సైనీకి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు దక్కింది. 202 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన లంకకు బుమ్రా తొలి ఓవర్‌లోనే షాక్ ఇచ్చాడు.

తొలి ఓవర్ చివరి బంతికి
తొలి ఓవర్ చివరి బంతికి ఓపెనర్ గుణతిలక (1) వాషింగ్టన్ సుందర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. శార్దూల్ ఠాకూర్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి అవిష్క పెర్నాండో (9) శ్రేయస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇక బుమ్రా వేసిన నాలుగో ఓవర్‌లో ఒషాడా ఫెర్నాండో (2)ను మనీశ్ పాండే రనౌట్ చేశాడు. దీంతో కీలక వికెట్లు కోల్పోయిన లంక కష్టాల్లో పడింది.

కుషాల్ పెరీరా క్లీన్ బౌల్డ్
నవ్‌దీప్ సైనీ వేసిన ఆరో ఓవర్ మొదటి బంతికి కుషాల్ పెరీరా (7) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే కష్టాల్లోపడ్డ జట్టును ఎంజిలో మ్యాథ్యూస్, ధనుంజయ డి సెల్వ ఆదుకొనే ప్రయత్నం చేశారు. వీరిద్దరు కలిసి 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. వాషింగ్టన్ సుందర్ వేసిన 12వ ఓవర్‌లో మ్యాథ్యూస్ (31) పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

123 పరుగులు చేసి అలౌటైన శ్రీలంక
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన దాసున్ శనక (9), వానిండు హసరంగా (0), లక్షన్ సందకన్ (1) త్వరగానే పెవిలియన్ చేరారు. వికెట్లు పడుతున్నా ధనుంజయ మాత్రం పట్టువదలలేదు. 36 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సులతో 57 పరుగులు చేసాడు. కానీ.. నవ్‌దీప్ సైనీ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన మలింగా (0) సైనీ బౌలింగ్‌లో కోహ్లీకి క్యాచ్ ఇవ్వడంతో శ్రీలంక 15.5 ఓవర్లలో 123 పరుగులు చేసి ఆలౌటైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications