India vs Sri Lanka 3rd T20I: పవర్‌ప్లేలో విజృంభించిన అవేష్ ఖాన్, సిరాజ్.. తల్లడిల్లిన లంక టాపార్డర్

ధర్మశాల: శ్రీలంకతో మూడో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన లంక బ్యాటర్లను భారత ఓపెనింగ్ బౌలర్లు పవర్‌ప్లేలో వణికించారు. యువ బౌలర్లు మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్ పరుగులు చేయకుండా కట్టడి చేయడంతోపాటు వరుసగా వికెట్లు తీసి పవర్ ప్లే ముగిసే సమయానికి శ్రీలంక ఓపెనర్లతోపాటు వన్‌డౌన్ బ్యాటర్‌ను ఫెమిలియన్ పంపారు. దీంతో పవర్ ప్లేలో సిరాజ్, అవేష్ ఖాన్ ధాటికి శ్రీలంక టాపార్డర్ తల్లడిల్లిందని చెప్పుకోవచ్చు.

వారెవ్వా సిరాజ్
హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ చెలరేగాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే వికెట్ తీసి శ్రీలంకను దెబ్బకొట్టాడు. సిరాజ్ ధాటికి శ్రీలంక ఓపెనర్ దనుష్క గుణతిలక డకౌట్ అయ్యాడు. సిరాజ్ విసిరిన బంతిని ఆడడంలో విఫలమైన గుణతిలక బౌల్డ్ అయ్యాడు. 140 కిలో మీటర్ల వేగంతో వచ్చిన బంతి బ్యాట్‌కు తాకి మరీ వికెట్లను గిరాటేసింది. దీంతో శ్రీలంక ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది.

దెబ్బకొట్టిన అవేష్ ఖాన్
ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన అవేష్ ఖాన్ కూడా లంకేయులను దెబ్బకొట్టాడు. గత మ్యాచ్‌లో 75 పరుగులతో చెలరేగిన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంకను ఒక్క పరుగుకే ఔట్ చేశాడు. రెండో ఓవర్ ఐదో బంతిని నిస్కాంక భారీ షాట్‌కు ప్రయత్నించగా అది గాల్లోకి లేచింది. దీంతో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వెంకటేష్ అయ్యర్ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.

పవర్‌ప్లేలో కట్టడి
ఆ తర్వాత ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లోనూ అవేష్ ఖాన్ విజృంభించాడు. వన్‌డౌన్ బ్యాటర్ చరిత అసలంకను 4 పరుగులకే ఫెమిలిమయన్ చేర్చాడు. నాలుగో ఓవర్ ఆరో బంతిని భారీ షాట్‌కు ప్రయత్నించిన అసలంక బంతిని గాల్లోకి లేపాడు. ఆ బంతినిక వికెట్ కీపర్ సంజూ శాంసన్ అందుకోవడంతో అసలంక ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 11 పరుగులకే 3 టాప్ వికెట్లను కోల్పోయింది. పరుగులు కూడా రాకుండా కట్టడి చేయడంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి శ్రీలంక 3 వికెట్ల నష్టానికి 16 పరుగులు మాత్రమే చేసింది. దీంతో శ్రీలంక బ్యాటర్లు పవర్‌ప్లేని ఉపయోగించుకుని పరుగులు రాబట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాగా పవర్‌ప్లేలోని 6 ఓవర్లను అవేశ్ ఖాన్, మహ్మద్ సిరాజ్‌తోనే రోహిత్ శర్మ వేయించడం గమనార్హం.

తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, అవేష్ ఖాన్
శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, చరిత్ అసలంక, దినేష్ చండిమల్(వికెట్ కీపర్), జనిత్ లియానాగే, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, జెఫ్రీ వాండర్సే, బినుర ఫెర్నాండో, లహిరు కుమార
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications