For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గెలుపుతో 2017కి వీడ్కోలు: 3-0తో సిరిస్‌ క్లీన్ స్వీప్ చేసిన భారత్

By Nageshwara Rao
Hosts win toss, elect to field

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌ని భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ముంబై వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 136 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.

ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లోనే ఓపెనర్ రెండో టీ20లో కేఎల్ రాహుల్(4) ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ బాది 27 పరుగులు చేసి ఔటయ్యాడు. షనక వేసిన 7వ ఓవర్ ఆఖరి బంతిని డీప్ మిడ్ మీదుగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన రోహిత్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

India whitewash Sri Lanka in T20s, Man of the Match Jaydev Unadkat feels confident

అనంతరం క్రీజులోకి వచ్చిన యువ ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్(30), మనీస్ పాండే నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. జట్టు స్కోరు 81 పరుగుల వద్ద ధనంజయ బౌలింగ్‌లో మనీష్ పాండే స్ట్రయిట్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బంతి బౌలర్ చేతికి తగలి వికెట్లకు తగలడంతో మరో ఎండ్‌లో ఉన్న శ్రేయస్ రనౌటయ్యాడు.

అ తర్వాత హార్థిక్ పాండ్యా 4 పరుగులు మాత్రమే చేసి డిక్‌వెలాకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులో ఉన్న దినేష్ కార్తీక్(18)తో కలిసి ధోని(16) జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ సిరీస్‌ విజయంతో భారత్ శ్రీలంకతో జరిగిన టెస్టు, వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంది.

తద్వారా 14 సిరీస్‌లను కైవసం చేసుకొని ఈ ఏడాది అద్భుతంగా ముగిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.


భారత్ విజయ లక్ష్యం 136

వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ శ్రీలంకను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. లంక బ్యాట్స్‌మెన్‌లలో గుణరత్నె చేసిన 36 పరుగులే అత్యధికం కావడం విశేషం. 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న శ్రీలంకను గుణరత్నేతో కలిసి సమరవిక్రమ ఆదుకొనేందుకు ప్రయత్నం చేశాడు.

ఈ క్రమంలో సమరవిక్రమ (21), దాసున్ షనక (29 నాటౌట్), ధనయంజయ (11 నాటౌట్), ఉపుల్ తరంగ (11), తిసారా పెరీరా (11) పరుగులు మాత్రమే చేయగలిగారు. భారత బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసుకోగా వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు.

Sri Lanka

శ్రీలంక ఇన్నింగ్స్ కొనసాగిందిలా:

ఆరు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయింది. 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గుణరత్నేతో కలిసి సమరవిక్రమ ఆదుకొనేందుకు ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సమరవిక్రమ (21) పరుగుల వద్ద పాండ్యా బౌలింగ్‌లో కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గుణతిలక కుల్దీప్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 13వ ఓవర్‌లో రెండు ఫోర్లు బాదిన కెప్టెన్ పెరీరా అదే ఓవర్ ఆఖరి బంతిని లెగ్ సైడ్ క్లిప్ చేసేందుకు ప్రయత్నించి రోహిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది. క్రీజులో గుణరత్నే(29), షనక(0) పరుగులతో ఉన్నారు.

10 ఓవర్లకు శ్రీలంక 67/4
వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో శ్రీలంక 10 ఓవర్లకు గాను 4 వికెట్లుకోల్పోయి 67 పరుగులు చేసింది. అంతకముందు 18 పరుగులకే మూడు వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో అసేల గుణరత్నె (24), గుణతిలక (1) పరుగులతో క్రీజులో ఉన్నారు.

Hosts win toss, elect to field

18పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన లంక
వాంఖడే స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టీ20లో ఆరంభంలోనే లంక మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఓపెనర్ డిక్‌వెలా(1) పరుగుల వద్ద రెండో ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఉనద్కట్ వేసి రెండో ఓవర్ ఐదో బంతిని భారీ షాట్ అడేందుకు ప్రయత్నించి మహ్మద్ సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.

అనంతరం సుందర్ వేసిన 3వ ఓవర్‌ ఆఖరి బంతిని కీలక ఆటగాడు కుషల్ పెరీరా సిరాజ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. మరో ఓపెనర్ తరంగ కూడా ఉనద్కట్ వేసిన నాలుగో ఓవర్ మూడో బంతికి పాండ్యాకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో శ్రీలంక నాలుగు ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు నష్టానికి 19 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో గుణరత్నే(0), సమరవిక్రమ(1) ఉన్నారు.

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

హైదరాబాద్: ముంబైలోని వాంఖడె స్టేడియంలో భారత్-శ్రీలంక జట్ల మధ్య సిరిస్‌లో చివరిదైన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు టీ20ల సిరీస్‌ను ఇప్పటికే టీమిండియా 2-0తో కైవసం చేసుకున్న టీమిండియా క్లీన్ స్వీప్‌పై కన్నేసింది.

ఈ మ్యాచ్లో టీమిండియా ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుండగా, శ్రీలంక కనీసం చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. మూడో టీ20లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. జస్ప్రీత్ బుమ్రా, చాహల్ స్ధానంలో మహమ్మద్ సిరాజ్‌, వాషింగ్టన్ సుందర్‌లు తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.

కాగా మూడో టీ20కి ముందు శ్రీలంకకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెండో టీ20లో గాయపడిన మ్యాథ్యూస్‌కి ఈ మ్యాచ్ నుంచి తప్పుకున్నాడు. అతడి స్థానంలో గుణతిలకకు తుది జట్టులో చోటు కల్పించారు. కాగా భారత జట్టులో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి విరామం కల్పించి అతడి స్థానంలో యువ బౌలర్ వాషింగ్టన్ సుందర్‌ని తొలిసారి అంతర్జాతీయ టీ-20 జట్టులోకి తీసుకోనున్నారు.

జట్ల వివరాలు:
భారత్‌: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), లోకేశ్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్, దినేశ్‌ కార్తీక్, మనీశ్‌ పాండే, ధోని, హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్, ఉనద్కత్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్,

శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), తరంగ, డిక్‌వెలా, కుశాల్‌ పెరీరా, సమరవిక్రమ, గుణరత్నే, షనక, అకిల ధనంజయ, చతురంగ డిసిల్వా, చమీర, నువాన్‌ ప్రదీప్‌.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Sunday, December 24, 2017, 22:53 [IST]
Other articles published on Dec 24, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+