
వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు
ఈ మ్యాచ్‌లో ధోని ఒక్క స్టంపింగ్ చేస్తే వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్ చేసిన వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డుని సృష్టిస్తాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు 299 వన్డేలాడిన ధోని ప్రస్తుతం 99 స్టంపింగ్స్‌తో శ్రీలంక మాజీ వికెట్ కీపర్ కుమార సంగక్కరతో సమానంగా ఉన్నాడు.

బ్యాట్స్‌మెన్‌గా మరో రికార్డు
ఇక బ్యాట్స్‌మెన్‌గా ధోనిని మరో ప్రపంచ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో ధోని నాటౌట్‌గా నిలిస్తే వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్‌గా ఉన్న రికార్డు కూడా సొంతమవుతుంది. ప్రస్తుతం 72 నాటౌట్‌లతో ధోనీ షాన్ పొలాక్, చమిందా వాస్‌లతో సమానంగా నిలిచాడు.

అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ధోని
ఈ సిరిస్‌లో ఇప్పటికే ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. రెండు, మూడు వన్డేల్లో భారత విజయంలో ధోని కీలకపాత్ర పోషించాడు. తద్వారా యువ ఆటగాళ్లతో పాటు సీనియర్ల అనుభవం కూడా జట్టుకి ఎంతో అవసరమని ఈ పర్యటనలో నిరూపించాడు. పల్లెకెలె వేదికగా జరిగిన రెండో వన్డేలో టెయిలెండర్ భువనేశ్వర్ కుమార్‌తో కలిసి ధోని అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే. భువీతో కలిసి ధోని వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇక, మూడో వన్డేలో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి జట్టుని విజయ తీరాలకు చేర్చాడు.

అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్
తద్వారా ఈ సిరీస్‌లోనే టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో బ్యాట్స్‌మన్‌గానూ ధోని నిలిచాడు. ఇప్పటివరకు ధోని 299 వన్డేలాడి 9608 పరుగులు చేశాడు. ఇందులో 10 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2019 వరల్డ్ కప్ వరకు ధోని ఆడితే వన్డేల్లో భారత్ తరుపున పదివేల పరుగుల మైలురాయిని అందుకునే అవకాశం ఉంది. భారత్ తరుపున సచిన్ టెండూల్కర్ (18426), సౌరవ్ గంగూలీ (11221), రాహుల్ ద్రవిడ్ (10768)లు మాత్రమే ఈ ఘనత సాధించారు. యావరేజి (51.55), స్ట్రయిక్ రేట్ (87.99) పరంగా వీళ్లందరి కన్నా ధోనీ ముందుండటం విశేషం.


Click it and Unblock the Notifications











